Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?

హైదరాబాద్: మీరు 2020-21 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, ఫార్మసీ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులా ? లేదా మీ ఇంట్లో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారా ? అయితే ఇది మీ కోసమే. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) లో మీ పేరు నమోదు చేసుకున్నారా ? ఇంకా చేసుకోనట్టయితే ఇక త్వరపడండి.

  • Nov 23, 2020, 21:19 PM IST

బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఎస్సీ, బీఏ, బీకాం, బీసీఏ, బీబీఎం, బీబీఏ, బీఫార్మసీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఎవరైనా టాస్క్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.

1 /8

ఇంతకీ ఈ టాస్క్ ఏంటి ?  ఉన్నత చదువులు చదివినా.. వాటి ఆధారంగా ఉద్యోగావకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యం లేకపోవడం అనేది విద్యార్థులను వేధిస్తున్న పెద్ద సమస్య. అంతేకాకుండా చదువు పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్స్ అవకాశాలు కల్పించని కాలేజీలకు చెందిన మరో సమస్య ప్లేస్‌మెంట్స్ కోసం ఎక్కడికి వెళ్లాలి అనేది. ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న యువతకు పరిష్కారం అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశమే ఈ టాస్క్.

2 /8

టాస్క్‌లో తమ పేరు నమోదు చేసుకున్న విద్యార్థులకు వారు ఎంచుకున్న కోర్సులకు అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్‌పై పట్టు పెంచుకునేలా మెళకువలు అందించడమే టాస్క్ లక్ష్యం. ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా చదువు పూర్తయిన వారికి ప్లేస్‌మెంట్స్, రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

3 /8

యువతకు వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం పెంచి, ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే అవకాశం ఉండటం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం, ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవడం ఈజీ అవుతుంది.

4 /8

అందుకు విద్యార్థులు చేయాల్సిందల్లా https://www.task.telangana.gov.in/Student-Email-Verification లోకి లాగాన్ అయి 2020-21 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే.

5 /8

నవంబర్ 16 నుంచి టాస్క్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా డిసెంబర్ 15 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా రిజిస్టర్ చేసుకునేందుకు వీలుంది. డిసెంబర్ 27 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

6 /8

ఇప్పటికే టాస్క్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది లైఫ్ టైమ్ వర్తిస్తుంది.

7 /8

టాస్క్‌లో విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకోవడానికి, వారికి పరీక్షల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగ నియామకాలు నిర్వహించే కంపెనీలకు అవసరమైన విద్యార్హతలు ఉన్న వారికి మాత్రమే ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

8 /8

టాస్క్‌లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708 రుసుం కింద చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295 చెల్లించాల్సి ఉంది. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.