Dussehra Navaratri 2024: దసరా పండగ ఎప్పుడు..?.. నవరాత్రులలో అమ్మవారి కలశ స్థాపన, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు..

Thu, 26 Sep 2024-11:13 pm,

సర్వ పితృ అమావాస్య  మరుసటి రోజున అశ్వయుజమాసం మొదలౌతుంది. పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు దేవీ నవరాత్రుల్ని ఎంతో నిష్టతో ఉండి, తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు కూడా ఉంటారు.

అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రుల ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు అక్టోబరు 3 న కలశస్థాపన చేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది తమ ఇళ్లలో ఘట స్థాపనలు చేస్తుంటారు. మరికొందరు ప్రత్యేకమైన మండపాలను  ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు.  

తొలుత పూజ ప్రదేశంను శుభ్రం చేసుకొవాలి.  ఆతర్వాత పీట మీద ఎరుపువస్త్రం,  నవధాన్యాలు వేయాలి. అమ్మవారి ప్రతిమపెట్టాలి.దాని మీద ఒక కలశం ఉంచాలి. కలశంలో.. నీళ్లు వేయాలి. పొక, పసుపు కొమ్ము , సుగంధం, కాయిన్ లు,వేసి దానిమీద అమ్మవారి విగ్రహాంను పెట్టాలి. దీనిలో అమ్మవారిని ఆవాహాన చేయాలి.

కొంత మంది ప్రత్యేకంగా కలశం చుట్టుదా.. మట్టి ప్రమిధలను ఏర్పాటు చేస్తారు. దీనిలో నవధాన్యాలు నానబెట్టుతారు. మట్టితో వేసి ఉంచడం వల్ల.. రోజు నీళ్లు పోస్తుంటారు. అప్పుడు ఇవి రోజు కొంచెం కొంచెంగా మొలకెత్తుతుంటాయి. అదే విధంగా అమ్మవారికి రోజు కుంకుమార్చన చేయాలి. అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలతో పాటు ప్రత్యేకంగా పూజలు చేసి ఆరతులు ఇవ్వాలి.  తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో  భక్తులను అనుగ్రహిస్తారు.

తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా తొమ్మిది రకాల స్వీట్లు, తొమ్మిది రకాల వస్త్రాలను అమ్మవారికి సమర్పించుకొవాలి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అంతేకాకుండా.. పంచమిని అమ్మవారికి ఎంతో ప్రధానమైదనిగా చెబుతుంటారు. ఈరోజున దుర్గఅమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తారు.

నవమి నాడు, దుర్గాదేవీగాను, దశమి రోజు అమ్మవారు మహిషసుర మర్దినిగాను భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 12న దశమి రోజున దసరా పండుగ జరుకుంటాము. ఈ రోజున సూర్యోదయం నుంచి రాత్రి వరకు దసరా యోగం ఉంది.  అందువల్ల తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకొవాలి. చాలా చోట్ల దసరా రోజున తప్పకుండా కొత్త బట్టల్ని కొనుగోలు చేస్తారు. 

దసరా రోజున జమ్మి శమీ చెట్టు దగ్గరకు వెళ్తుంటారు. జమ్మి చెట్టును దర్శించుకొవడం, పాలపిట్టను చూడటం ఎంతో పుణ్యప్రదంగా చెప్తుంటారు. ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని శక్తాను సారంగా భక్తితో కొలుచుకుంటూ, జీవితంలో ఉన్నతస్థానానికి ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   

చెడుపై మంచి,  అసత్యంపై సత్యం గెలిచిన విజయానికి ప్రతీకగా..అశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. అదే విధంగా దశమి రోజున విజయదశమని నిర్వహిస్తాము. ఈ రోజున చాలా చోట్ల రావణుడి ప్రతిమలను దగ్దం చేసే ఆచారంను పాటిస్తారు. శాస్త్రాల ప్రకారం, ఈ రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించారని చెబుతుంటారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link