White Vs black sesame: తెల్ల నువ్వులు Vs నల్ల నువ్వులు సమ్మర్ లో హెల్త్ కు ఏది మంచిదో తెలుసా..?
నువ్వులలో ఫైబర్ లు, ఐరన్ లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్ లు మొదలైనవి ఉంటాయి. మనం తెల్లనువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వంటలలో,తినేపదార్థాలు తయారు చేయడంలో తెల్లనువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తాం.
తెల్లనువ్వులు తినడం వల్ల, శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా తెల్లవెంట్రుకల సమస్యలు దూరమైపోతాయి. ఎములకు క్యాల్షియం అందుతుంది. బెల్లీఫ్యాట్ తో ఉండే వారు తెల్ల నువ్వులు తినడం వల్ల మంచిఉపశమనం లభిస్తుంది.
తెల్లనువ్వులు క్రమంగా తినడం వల్ల రక్త హీనతకు చెక్ పడుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంపై మచ్చలు అన్ని దూరమైపోతాయంటారు. మొటిమల ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే వంటలలో, చకినాలు, వడియాలు, లడ్డుల తయారీలో తెల్ల నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇక నల్ల నువ్వులను ఎక్కువగా దేవతా కార్యాలు, పితృదేవతలు దేవతలకు సంబంధించిన పనుల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్రాధ్దకర్మలలో.. నల్లనువ్వులను వాడతారు. నల్ల నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు.
నల్ల నువ్వులు కరకరలాడుతూ, ఎంతో రుచిగా ఉంటుంది. నల్లనువ్వులలో విటమిన్లు, మినరల్స్ లు ఎక్కువగా ఉంటాయి. నల్ల నువ్వుల వల్ల ముఖంపై మచ్చలు దూరమైపోతాయి. మెమోరీ పెరుగుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. నల్ల నువ్వులలో ఫైబర్ లు, ప్రోటీన్ లు ఉంటాయి.
సమ్మర్ లో శరీరం తొందరగా డీహైడ్రేషన్ సమస్యలకు లోనైపోతుంటుంది. ఇలాంటి వారు తెల్లనువ్వులు తింటే ఎంతో ఉపశమనం ఉంటుంది. దురద వంటి సమస్యలను కూడా నువ్వులు దూరం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)