Celebrity Divorce: సింగర్ తో అఫైర్ అందుకే విడాకులు తీసుకున్న స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే?

Fri, 20 Sep 2024-5:12 pm,

18 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న జయం రవి అనూహ్యంగా ఒక అమ్మాయి కోసం విడాకులు తీసుకున్నారనే.. వాదన తెరపైకి వచ్చింది.  దీంతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. హీరో జయం రవి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో రిలేషన్ లో ఉన్నారని, ఆమెపై మోజుతోనే తన భార్య ఆర్తి కి  విడాకులు ఇచ్చారు అనే వార్త వైరల్ గా మారింది.  

ఈ నేపథ్యంలోనే  జయం రవి విడాకులకు కారణమైన ఈ కేనీషా ఫ్రాన్సిస్ ఎవరు?  ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అంటూ నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. కేనీషా ఫ్రాన్సిస్ ఒక సింగర్ , ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి భారీ పాపులారిటీ దక్కించుకుంది. బెంగళూరుకు చెందిన ఈమె.. గోవాలోని పబ్ లలో పాటలు పాడుతూ అక్కడి వారిని ఆకర్షించేది.  తమిళంలో జీవా.. నిర్మించిన ఒక ఆల్బమ్ లో కూడా ఈమె పాటలు పాడింది. అడపా దడపా సినిమాలలో పాడడంతో పాటు సోలో ఆల్బమ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది కేనీషా. 

అయితే ఈమెకు పెళ్లి కూడా అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె భర్త ఎవరు? పిల్లలు ఉన్నారా ? అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇకపోతే జయం రవి తన సినిమాలో షూటింగ్ లు లేని సమయంలో కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్తుండేవాడట. అక్కడ పబ్ కి వెళ్ళినప్పుడు కేనీషా ఫ్రాన్సిస్  పరిచయం అయ్యిందని సమాచారం. 

ఇకపోతే కేనీషా స్వరానికి ఫిదా అయిన జయం రవి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఈ స్నేహం.. ఆర్తి జయం రవి ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టింది. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు వస్తున్నాయని.. దానికి కారణం కెనీషా అని సమాచారం .

సాధారణంగా ప్రతి ఏడాది కూడా తమ పెళ్ళి రోజున జయం రవి.. పిల్లలు,  భార్య,  కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఏడాది తనకు షూటింగ్ ఉందని చెప్పి వార్షికోత్సవం జరుపుకోకుండానే గోవా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్తి వెంటనే గోవా వెళ్లి జయం రవి ఎప్పుడు బస చేసే  హోటల్లో పరిశీలిస్తే.. కేనీషా, జయం రవి సపరేటుగా బంగ్లా నిర్మించుకున్నారని, అక్కడ లివింగ్ రిలేషన్ చేస్తున్నారని అసలు విషయం బయటపడింది. దీంతో గొడవపడిన ఆర్తి కి జయం రవి విడాకులు ఇచ్చారని సమాచారం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link