Who is Next Karnataka CM: త్వరలో సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా..? రేసులో ఉన్న నేతలు వీళ్లే..!
ముడా కుంభకోణం సీఎం సిద్దరామయ్య సీటుకు గండం తెచ్చేలా ఉంది. హైకోర్టు విచారణకు ఆదేశించడంతో ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తారని అంటున్నారు.
ఇటు ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు. సిద్ధరామయ్య నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవిని ఎవరు భర్తీ చేస్తారనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇప్పటికే డీకే శివకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు డీకే చాలా కష్టపడ్డారు. ఆయనకు అప్పుడే సీఎం పదవి దక్కుతుందని అందరూ భావించగా.. అధిష్టానం మాత్రం సిద్దరామయ్యకు కట్టబెట్టింది.
డీకే శివకుమార్ తరువాత మల్లికార్జున ఖర్గే, డాక్టర్ జి.పరమేశ్వర్ పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఘటనలో సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ అండగా నిలబడుతున్నారు. సీఎం రాజీనామా చేసే ప్రశ్నే లేదని.. ఏ తప్పూ చేయలేదని గతంలోనే స్పష్టం చేశారు. ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని మండిపడ్డారు.
తాను ముఖ్యమంత్రికి వెన్నుపోటు పొడిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తమ నేతలపై ఇలాంటి కుట్రలు గతంలో జరిగాయని.. తమకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందన్నారు.
అయితే అనిశ్చితికి మారుపేరైన కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విచారణ మొదలైతే సీఎం రాజీనామా ఖాయమని అంటున్నారు.