Baba Vanga: బాబా వంగ ఎవరు..?.. ఆమె చూపుకోల్పోవడం.. అతీంద్రియ శక్తులు ఏవిధంగా వచ్చాయో తెలుసా..?..
బాబా వంగ బల్గెరియాలో 1911 లో జన్మించారంట. అదే విధంగా ఆమె తన 12 ఏళ్ల ప్రాయంలో ఒకసారి ఇంటి నుంచి బైటకు వెళ్లారంట.అప్పుడు భారీగా వర్షం కురుస్తుందంట. ఉరుములు, పిడుగులు పడుతున్నాయంట.
అయితే.. బాబా వంగ ఒక్కతే వర్షంలో చిక్కుకుపోయిందంట. అయితే.. ఒక పిడుగు పడిదంట. అది చూసిన బాబా వంగ తన చూపును కోల్పోయిందంట. కాసేపటికి తనకు కళ్లు కన్పించడంలేదని చాలా ఏడ్చిందంట.
అక్కడి వారు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పిడుగు, తుపాను ప్రభావం వల్ల చూపు పోయిందని చెప్పారంట. అప్పటి నుంచి ఆమెకు ఎవో అతీంద్రియ శక్తులు వచ్చాయని చెప్తుంటారు. చూపు లేకపోయిన బాబా వంగ అందరిలాగే తన పని తాను ఈజీగా చేసుకునేంట. ఆమె దైవదూతలతో మాట్లాడేవారని చెప్తుంటారు.
కొన్నిరోజులకే బాబా వంగ భవిష్యత్తును ఊహించి.. చెప్పడం స్టార్ట్ చేసిందంట. మొదట్లో ఆమెను పట్టించుకుని వారు..క్రమంగా బాబా చెప్పినవన్ని పొల్లుపొకుండా జరుగుతుండంతో ఆమెకు భక్తులుగా మారిపోయారంట. ముఖ్యంగా.. 2001 అమెరికా ట్విట్ టవర్స్ దాడి, అమెరికా గడ్డపై నల్లజాతీయుడు ప్రెసిడెంట్ అవ్వడం, రష్య ఉక్రెయిన్ యుద్దాల్ని సైతం ముందే ఊహించి చెప్పారంట. కరోనాను కూడా ముందే ఊహించారంట.
ట్రంప్ పై గన్ కాల్పుల దాడుల్ని సైతం బాబా వంగ అప్పట్లోనే చెప్పారని ఇటీవల ప్రచారం కూడా జరిగినట్లు తెలుస్తొంది. బాబా వంగ తన 85 వ ఏటలో 1996 లో మరణించినట్లు తెలుస్తొంది. ఇప్పటికి అనేక దేశాల్లో బాబా వంగ విగ్రహాలు, ఫోటోలు తమ ఇళ్లలో పెట్టుకుని పూజించుకుంటారంట. దీనిలో ఎంత నిజముందో కానీ.. ప్రస్తుతం బాబా వంగ గురించి అనేక కథనాలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి.
అయిన కూడా.. ఐదువందల ఏళ్ల భవిష్యత్ ను ముందే ఊహించి చెప్పారంట. ముఖ్యంగా ప్రస్తుతం బాబావంగ 2025 లో భవిష్యత్తు గురించి చెప్పిన జాతకం ఇప్పుడు ప్రపంచ దేశాల్ని గడ గడలాడిస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు యుద్దాలు, మరోవైపు నేచర్ డిజాస్టర్ లు సంభవిస్తాయని బాబా వంగ చెప్పారంట.
బతకడం కంటే చావుమేలని అన్పించేలా.. 2025 లో యుగాంతంకు బీజాలు పడుతాయని బాబా వంగ చెప్పారంట. కరువు కాటకాలు, యూరప్ లో అనేక దేశాల మధ్య యుద్దోన్మాదం, మూడో ప్రపంచ యుద్దం వచ్చి.. తిరిగి చాలా నష్టం వాటిల్లుతుందని బాబా వంగ చెప్పారంట.
ఉష్ణోగ్రతలు పెరిగి మంచు అంతా కరిగిపోతుందంట. మనిషి ఒకర్ని మరోకరు దోచుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయంట. అతిగా వర్షాలు, అతిగా ఊష్ణోగ్రతలు మొదలైన చర్యల వల్ల నేచర్ అంతా డిజాస్టర్ గా మారిపోతుందని వంగా బాబా చెప్పారంట. ఆర్థిక పతనాలతో అనేక దేశాలు అల్లకల్లోలంగా మారిపోతాయని బాబా వంగ చెప్పారంట.