AR Rehman: ఏఆర్ రెహమాన్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చారు ? దిలీప్ కుమార్ పేరంటే ఎందుకిష్టం లేదు ?
ఆస్కార్ అవార్డు లభించిన తరువాత ఆయన అమెరికా లాస్ ఏంజిల్స్‌కు షిఫ్ట్ అయిపోయారు. ఈ సందర్బంగా హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులతో పరిచయమైంది. అయితే 2015లో ఏఆర్ రెహమాన్ తిరిగి ఇండియాకు వచ్చేశారు. దీనికి కారణం..ఏఆర్ రెహమాన్ తల్లి అనారోగ్యం, పిల్లలు పెద్దవాళ్లవడం. తాను ఒకవేళ ఇంటికి తిరిగి రాకపోతే తన పిల్లలు తనను అంకుల్ అని పిలుస్తారేమో అని స్వయంగా ఏఆర్ రెహమాన్ చెప్పారు.
రెహమాన్ సాధించిన అవార్డుల జాబితా చాలా పెద్దదే ఉంటుంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు అందించిన సంగీతం రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు సాధించిపెట్టింది. ఇది కాకుండా చాలా జాతీయ పురస్కారాలున్నాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయనను సన్మానించారు.
రెహమాన్‌కు తొలి అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు రోజా సినిమాతో ఇచ్చారు. ఈ సినిమా సంగీతం భారతదేశ సినీ ప్రపంచంలో హల్‌చల్ చేసింది.
23 ఏళ్ల వయస్సులో రెహమాన్ తన కుటుంబంతో సహా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. రెహమాన్ పూర్తి పేరు అల్లా రఖా రెహమాన్. ఏఆర్ రెహమాన్ భార్య పేరు సైరా బాను..ఆయనకు ముగ్గురు పిల్లలు..ఖతీజా, రహిమా, అమీన్.
ఏఆర్ రెహమాన్ 9 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయారు. ఆ సమయంలో అతని తల్లి..తండ్రికి సంబంధించిన వాద్య పరికరాల్ని అద్దెకిస్తూ..వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించారు. ఇటీవల ఆమె కూడా మరణించారు.
సంగీత ప్రపంచంలో బాద్‌షాగా ఉన్న ఏఆర్ రెహమాన్ ఓ హిందూ కుటుంబంలో పుట్టారు. అతని అసలు పేరు దిలీప్ కుమార్. కానీ ఆయనకు ఆ పేరు అసలు ఇష్టం లేదు. ఆ పేరు తన పేదరికపు రోజుల్ని గుర్తు చేస్తుందని బయోపిక్‌లో స్పష్టం చేశారు కూడా.