Winter hair care tips: చలికాలంలో బాగా జుట్టు ఊడుతోందా ? హెయిర్ లాస్ అవకుండా ఇలా చేయండి..
1. రోజు తలస్నానం చేయడం వల్ల కొన్నాళ్లకు షాంపూల ప్రభావం ఎక్కువవుతుంది. మాడుపై ఉండే సహజ నూనెలు ( Natural oils on scalp ) పోయి జుట్టు ఎండు గడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత లేదా పీహెచ్ 5.5 ఉన్న నాణ్యమైన షాంపూతో రెండ్రోజులకోసారి తలస్నానం చేస్తే సరిపోతుంది.
2. కనీసం వారానికి ఒకసారైనా గోరువెచ్చని స్వచ్చమైన కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకోవడం తప్పనిసరి.
3. స్టైలింగ్ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్ వాడడం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్లకు తగిలేలా రాయడం చేస్తుంటారు. కానీ పూర్తిగా ఆరిన తర్వాతే రాయాలి.
4. తలస్నానం చేసి వచ్చిన వెంటనే జుట్టు దువ్వుకుంటుంటారు. అలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడే ప్రమాదం ఉంది. పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొని ఆ తర్వాత జెల్స్ రాసుకుంటే ఆ ఇబ్బంది కొంతమేరకు తగ్గించిన వాళ్లు అవుతారు.
5. కొందరికి రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. మరునాడు తెల్లవారి లేవగానే తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. జుట్టుకు నూనె రాసుకుని ఆ తర్వాత రెండు గంటలకు తలస్నానం చేయడం మంచిది.
6. కొందరు స్టైల్ కోసం జుట్టు అందంగా కనిపించడం కోసం మార్కెట్‌లో లభించే జెల్స్ వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల అప్పటికప్పుడు జుట్టు అందంగా కనిపించినా జుట్టు రాలడం సమస్య ఎదురవుతుంది. రసాయనాలతో కూడిన జెల్స్ వాడకపోవడమే మంచిది.