Skin and hair care tips: అందమైన చర్మం, జుట్టు కోసం సింపుల్ టిప్స్
చలికాలంలో చర్మంలోని తేమ ఆవిరై చర్మం పొడిబారుతుంది. దీంతో చర్మం మెరుపును కోల్పోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో దురదకు దారితీస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్లను రాసుకోవడం ద్వారా చర్మంలోని తేమ ఆవిరవకుండా ఉంటుంది.
చలికాలంలో ఎప్పుడూ ఉపయోగించే సాధారణ సబ్బులకు బదులుగా మైల్డ్ సోప్స్ వినియోగించాలి. లిక్విడ్ క్లీనర్లు కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా చలిని తట్టుకోవడం కోసం బాగా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేయడం కూడా సరికాదు. వేడి నీళ్ళు చర్మానికి హాని కలిగిస్తాయి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఇబ్బందులు ఉండవు.
చలికాలంలో వెంట్రుకల్లోని తేమ ఆవిరై పొడిబారుతాయి. కనుక చలి కాలంలో మైల్డ్ షాంపూలే ( Mild shampoos ) వినియోగించాలి. తల స్నానానికి గంట ముందు నూనె రాసుకొని, మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు సరిపడా తేమ అందుతుంది. అలాగే తడి జుట్టుకు కండిషనర్ అప్లై ( How to apply hair conditioner ) చేసుకోవాలి.
శీతాకాలంలో చుండ్రు సమస్య మరీ ఎక్కువగా వేధిస్తుంటుంది. దీనికి యాంటీడాండ్రఫ్ షాంపూ ఎంచుకోవాలి. తల స్నానానికి గోరువెచ్చని నీళ్లే ఉపయోగించాలి. ప్రతీ రోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నట్టయితే.. చలికాలంలో వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది.