World Heritage Day 2023: భారత్‌లో వారసత్వ, చారిత్రక కట్టడాలు ఇవే! కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..

Tue, 18 Apr 2023-12:52 pm,

ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి తాజ్ మహల్.. ఈ చరిత్రక కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా ఇచ్చింది. అయితే యునెస్కో గుర్తించిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ మొదటిది. ఈ కట్టడం యమునా నది ఒడ్డున ఉండడంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కాబట్టి పర్యాటకులకు ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

పోర్చుగీస్ భవనాల స్టైల్‌ ఉన్న చర్చిలు, కాన్వెంట్‌లు కాథలిక్  భవనాలకు విశేష గుర్తింపు ఉంది. ఇవి పురాతన వాస్తుశిల్పతో ఉండడం వల్ల ఈ చర్చిలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే వీటిని చూసేందుకు ఇతర దేశాల పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తారు.

 

ఉత్తరాఖండ్‌లోని చమోలిలోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది పచ్చిక భూములు  ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ ఆసియాటిక్ నల్ల ఎలుగుబంటితో పాటు మంచు చిరుత, నీలి గొర్రెలు నివసిస్తాయి.

 

విజయనగర సామ్రాజ్యం అంటే అందరికీ తెలిసిందే.. ఇక్కడ 1500 ADలో నిర్మించిన చాలా రకాల అద్భుతమైన కట్టడాలున్నాయి. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరం. హంపి విజయనగర సామ్రాజ్యంలో నిర్మాణాల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.

కాజిరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పనక్కర్లేదు. ఇది వన్యప్రాణులకు ఓ అద్భుత నిలయం. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. కాజిరంగా నేషనల్ పార్క్ 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది చిత్తడి మడుగులతో నిండి ఉంటుంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link