Turkey gold mines: బయటపడిన అతి పెద్ద బంగారు నిధి.. దీని విలువ ఎంతో తెలుసా ?

Thu, 24 Dec 2020-7:35 pm,

వరల్డ్‌మీటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్దీవుల జిడిపి 4.87 బిలియన్ డాలర్లు, లిబేరియా జీడీపీ 3.29 బిలియన్ డాలర్లు, భూటాన్ 2.53 బిలియన్ డాలర్లు, బురుండి 3.17 బిలియన్ డాలర్లు, లెసోతో 2.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 

ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు టర్కీలో లభించే నిధి కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా, మౌరిటానియా, మోంటెనెగ్రో, బార్బడోస్, గయానా, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా టర్కీలో బయటపడిన బంగారు నిధి కంటే చిన్నవే కావడం గమనార్హం.

ఈ నిధి టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో కనుగొన్నారు. టర్కీ గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ ( Turkey Gubretas Fertiliser ) వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ చీఫ్ అయిన ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. బంగారు నిధి విలువ ( Turkey gold mines value ) సుమారు 6 బిలియన్ డాలర్లు ఉంటుందని పోయరాజ్ టర్కీ వార్తా సంస్థకు తెలిపారు.

సెప్టెంబర్‌లో, టర్కీ ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ 38 టన్నుల బంగారం ఉత్పత్తితో దేశం పెద్ద రికార్డును బద్దలు కొట్టిందని అన్నారు. రాబోయే ఐదేళ్లకు తన లక్ష్యం వార్షిక బంగారు ఉత్పత్తిని 100 టన్నులకు పెంచడమేనని ఆయన చెప్పారు.

రాబోయే రెండేళ్లలో ఈ బంగారం తవ్వడం జరుగుతుందని. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుందని పోయరాజ్ అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తిదారుడు 2019లో మరో సంస్థతో కలిసి ఈ సైట్‌ను సొంతం చేసుకున్నారని ఆయన చెప్పారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link