Devils Forest: ప్రపంచంలోని అతి రహస్యమైన భయంకర అడవి ఇదే, ఇక్కడికొస్తే సూసైడ్ తప్పదు

Wed, 30 Aug 2023-8:20 pm,

అడవిలోంచి విన్పించే కేకలు

ఈ అడవిలో రాత్రి వేళ అరుపులు, కేకలు విన్పిస్తుంటాయంటారు. అందుకే దెయ్యాలు నివసించే రహస్యమైన అడవిగా పరిగణిస్తుంటారు.

అడుగడుగునా హెచ్చరికలు

ఈ అడవిలో అడుగడుగునా హెచ్చరికలుంటాయి. అడవి 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే ఇక్కడి స్థానికులు కూడా దారితప్పిపోతుంటారు. ఈ అడవిలో చాలా మృతదేహాలు లభ్యమౌతుంటాయి

దెయ్యాల అడవిగా

ఈ అడవిలోకి వచ్చిన వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే ఈ అడవిని అన్నింటికంటే రహస్యమైన దెయ్యాల అడవిగా చెబుతారు. ఈ అడవి టోక్యో నుంచి రెండు గంటసల దూరంలో ఉంది. ఈ అడవిలో దెయ్యాలు నివాసముంటున్నాయని, ఈ దెయ్యాలే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంటాయని అంటారు

సూసైడ్ ఫారెస్ట్‌గా నామకరణం

ఈ రహస్యమైన అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ అడవి జపాన్ దేశంలో ఉంది. ఈ అడవి పేరు ఓంకిగహ్రా, Aokigahara Suicide Forest.ఈ అడవిలో సూసైడ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. పచ్చని ఈ అడవి చూసేందుకు ఎంత అంతంగా ఉంటుందో..అడవిలోని నిశ్శబ్దం అంత భయం గొలుపుతుంటుంది.

ఈ అడవిలో సూసైడ్ ఘటనలు

ప్రపంచంలోని ఈ అతి రహస్యమైన, భయంకరమైన అడవిలో జనం ఆత్మహత్య చేసుకుంటారనే సంగతి చాలామందికి తెలియదు. ఈ అడవి వెనుక దాగున్న రహస్యం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే ప్రపంచంలోనే అత్యత భయంకరమైన సూసైడ్ పాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ అడవిపై నిరంతరం చాలా పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link