Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..

Mon, 20 May 2024-4:34 pm,

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంను డెవలప్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా  శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.  

చాలా మంది భక్తులు తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నారు. తిరుపతి వరకు వెళ్లలేని భక్తులు యాదాద్రికి వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి దేవస్థానం బోర్డు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు కొన్నిసూచనలు చేసింది.

యాదాద్రి ఆలయంలో ఆర్జీత సేవల్లో పాల్గొనే భక్తులు అంటే.. కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం, జోడు సేవ, శ్రీ సుదర్శన నరసింహ హోమం, అష్టోత్తరం, కుంకుమర్చన మొదలైన కార్యక్రమాలకు హజరయ్యే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని కోరింది. 

తిరుపతిలో మాదిరిగానే.. పురుషులు పంచా లేదా తెల్ల లుంగీ, అమ్మాయిలు పంజాబీ డ్రెస్ లు, మహిళలు చీరలు ధరించి ఆర్జీత సేవాలలో పాల్గొనవచ్చని ఆలయం అధికారులు తెలిపారు. ఈ డ్రెస్ కోడును ఫాలో అయిన వాళ్లకు మాత్రమే ఆర్జీతసేవల్లో పాల్గొనే అవకాశం  కల్పిస్తారని దేవస్థానం సిబ్బంది తెలిపింది.

ముఖ్యంగా సాంప్రదాయ డ్రెస్ కోడ్ నిబంధనను జూన్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో భక్తులంతా పై సూచనలను గమనించాలని కూడా దేవ స్థానం సిబ్బంది కోరారు. ప్రతి ఒక్కరు తమకు సహాకరించాలని కూడా ఆలయం ఈవో ఒక ప్రకనటలో వెల్లడించారు

యాదాద్రిలో భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన నియమం పాటించాలని సూచించారు. అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనానికి క్యూ లైన్‌లో వచ్చే భక్తులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో స్వామివారికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎండాకాలం సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రికి తరలివస్తుండటంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link