Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర రఫ్పాడించిన డబ్బింగ్ సినిమాలు ఇవే..
ప్రేమలు.. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ప్రేమలు. చిన్న చిత్రంగా విడుదలైన మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది ఈ డబ్బింగ్ చిత్రం.
మంజుమ్మేల్ బాయ్స్..
మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘మంజుమ్మేల్ బాయ్స్’. ఈ సినిమా మలయాళంలోనే కాదు.. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మహారాజా..
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘మహారాజా’. ఓ కూతురు కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు చైనాలో కూడా దుమ్ము దులుపుతుంది.
రాయన్..
ధనుశ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.
అమరన్..
శివకార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. ఈ సినిమా తమిళం సహా తెలుగులో మూడింతలు లాభాలను తీసుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.