Star actress in Bigg Boss: బిగ్ బాస్ లోకి ప్రముఖ సీనియర్ నటి.. ఫ్యాన్స్ ఖుషి..!

Thu, 26 Sep 2024-4:06 pm,

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం  లేదు. బిగ్ బ్రదర్ పేరిట పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ షోని బిగ్ బాస్ పేరిట హిందీలో తొలిసారి మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్కడ 18వ సీజన్ కూడా ప్రారంభం అయింది. 

ఇక తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఎనిమిదవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టగా.. మూడు వారాలకు గాను ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.  

ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే తమ స్ట్రాటజీ చూపిస్తూ టాస్క్ గెలుస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరో రెండు వారాలలో దాదాపు 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఇటీవల బిగ్ బాస్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ హౌస్ లోకి రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు అలనాటి అందాల తార ప్రేమ. దేవి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పుడు అంత ఫేమ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాబోతోంది అంటూ ఒక వార్త సంచలనం సృష్టించింది. 

అయితే ఈమె రాబోయేది తెలుగు బిగ్ బాస్ లోకి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కన్నడలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రేమ అడుగుపెట్టబోతుందని సమాచారం. సెప్టెంబర్ 29  ఆదివారం రోజు బిగ్ బాస్ 11 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ రియాల్టీ షో కి ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా మళ్లీ తన టాలెంట్ ని చూపించబోతున్నారు. 

ఇకపోతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 11 లోకి కమెడియన్స్, టీవీ నటులు,  గాయకులు,  సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కూడా రాబోతున్నారట.  వినోదభరితంగా ఈ సీజన్ ను మార్చబోతున్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలోనే షర్మిత గౌడ, భవ్య గౌడ, సుకృతానాగ్ తో పాటు నటుడు త్రివిక్రమ్ , ప్రముఖ సీనియర్ హీరోయిన్ ప్రేమ కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.. మొత్తానికైతే ప్రేమ బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 లోకి కంటెస్టెంట్ గా రాబోతోంది అని తెలిసి అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link