Foreign Tour: విదేశీ టూర్‌కు వెళ్తారా? ఖర్చుకు భయపడొద్దు.. కేవలం రూ లక్ష ఉంటే చాలు

Fri, 12 Jul 2024-1:50 pm,

Budget Friendly Foreign Tour: ప్రయాణాలను ఇష్టపడే వారు విదేశాలకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్నదని భావిస్తారు. కానీ తక్కువ ఖర్చుతో చాలా దేశాలు పర్యటించవచ్చు.

Budget Friendly Foreign Tour: సరసమైన ధరలకు విదేశాలను సందర్శించవచ్చు. తక్కువ ఖర్చు, వీసా లేకుండా కొన్ని దేశాలు ఉన్నాయి. లక్ష రూపాయలలో సందర్శించే దేశాల జాబితా ఇదే.

థాయ్‌లాండ్ Budget Friendly Foreign Tour: సముద్ర తీర ప్రాంతాలను ఆస్వాదించాలంటే థాయిలాండ్‌ వెళ్లాల్సిందే. అక్కడ మసాజ్‌, అందమైన బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. థాయిలాండ్‌ వెళ్లడానికి పెద్దగా ఖర్చు కాదు.

శ్రీలంక  Budget Friendly Foreign Tour: మన పొరుగు దేశం శ్రీలంకకు అతి ఖర్చుతో వెళ్లవచ్చు. అక్కడ అనేక చారిత్రక కట్టడాలు, అందమైన లోయలు ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ సమయంలో శ్రీలంక సందర్శనకు ఉత్తమమైనది.

నేపాల్ Budget Friendly Foreign Tour: మన పక్క దేశం నేపాల్‌ను అతి తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. బీహార్, ఉత్తరప్రదేశ్‌ నుంచి కొన్ని గంటల్లో వెళ్లవచ్చు.

మలేసియా  Budget Friendly Foreign Tour: ప్రపంచంలోనే మలేసియాకు అత్యధికంగా పర్యాటకులు వెళ్తుంటారు. మలేసియాలోని నగరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి గుర్తింపు పొందాయి. ఇక్కడ మీరు తక్కువ ధరలలో అనేక అందమైన ప్రదేశాలు చూడవచ్చు.

ఇండోనేసియా

Budget Friendly Foreign Tour: అచ్చం భారతదేశం లాంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశం ఇండోనేసియా. ఈ దేశం సందర్శించేందుకు అతి తక్కువ ఖర్చవుతుంది. మన రూపాయి విలువ అక్కడ రూ.197.28కి సమానం.

ఈజిప్ట్ Budget Friendly Foreign Tour: ప్రపంచంలోనే అతి పురాతన ప్రదేశంగా ఈజిప్టు గుర్తింపు పొందింది. ఈజిప్షియన్ పిరమిడ్లు, మమ్మీ సంస్కృతికి ప్రసిద్ధి పొందిన ఈజిప్టును తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. చారిత్రక ప్రదేశాలను ఇష్టపడేవారికి ఈజిప్టు చక్కటి దేశం.

కంబోడియా Budget Friendly Foreign Tour: పురాతన దేవాలయాలను సందర్శించాలంటే కంబోడియా వెళ్లాల్సిందే. బీచ్‌లు, అద్భుతమైన ఆహారాలు ఇక్కడ సొంతం. ఈ దేశానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link