EPF Retaining: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Wed, 20 Nov 2024-7:16 pm,

 EPF Retaining: కొంతమంది తమ ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ లో ఉన్న డబ్బును రిటైర్ అయిన తర్వాత విత్ డ్రా చేయాలనుకోరు. అందుకు పలు కారణాలున్నాయి. అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపును పరిగణలోనికి తీసుకుని ఈపీఎఫ్ అకౌంట్ను కంటిన్యూ చేయాలని అనుకుంటారు.అయితే ఇందులో పన్నులు, వడ్డీ వసూలు, వ్యవధి ఎంతకాలం నిధులు క్లెయిమ్ చేసుకోకుండా ఉండవచ్చనే నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తెలసుకోవడం మంచిది. 

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన లేదా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ సభ్యుడిగా కొనసాగవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యత్వానికి వయస్సు లిమిట్ లేదు. అయితే ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులపై వడ్డీ చెల్లించేందుకు, ఉద్యోగి యజమాని సంబంధం, నెలలవారీ కంట్రిబ్యూషన్లను కొనసాగుతుండాలి. 

ఈమధ్య సవరణ ప్రకారం, ఉద్యోగి 55 ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ చేస్తే ఆ  తర్వాత ఖాతాదారుడు ఈపీఎఫ్ కార్పస్ ను విత్ డ్రా చేసుకోకపోతే అకౌంట్ కు చివరి యజమాని కంట్రిబ్యూట్ చేసిన తేదీ నుంచి 36 నెలల తర్వాత వడ్డీ వసూళ్లు ఆగిపోతాయి. అంటే క్రియాశీల కంట్రిబ్యూషన్లు ఆగిన  తర్వాత ఫండ్స్ వడ్డీని పొందుతాయి. అయితే ఇది ఖాతాదారుడి రేటు పన్ను పరిధిలోకి వస్తుంది.   

యజమాని కంట్రిబ్యూషన్ తేదీ నుంచి 36నెలల తర్వాత అకౌంట్ పనిచేయదు. ఒకవేళ అకౌంట్ పనిచేయడం ఆగిపోయిన 7ఏళ్లలోపు ఆ మొత్తం క్లెయిమ్ చేయకపోతే అది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇలా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత 25ఏళ్ల తర్వాత కూడా ఆ మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేయకుండా ఉంటే ఆ నిధులను క్లెయిమ్ చేసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. 

ఈపీఎఫ్ఓ ఖాతాదారుడి శ్లాబ్ రేటు ప్రకారం చివరి యాక్టివ్ కంట్రిబ్యూషన్ తర్వాత వచ్చే వడ్డీ ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పన్ను పరిధిలోకి ఇది వస్తుంది. అయితే అప్పటి వరకు వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ  పన్నును మినహాయించదు కాబట్టి మూలం వద్ద మినహాయించిన పన్నుల వివరాలను కలిగి ఉన్న ఫారం 26ఏఎస్ లో ఈ పన్ను ఉండదు.

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఈ వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద చేర్చేందుకు ఖాతాదారుడు బాధ్యత వహిస్తాడు. అత్యధిక ఆదాయపు పన్ను రేటు 30శాతం ఉన్న ఖాతాదారుడికి ఈపీఎఫ్ నిధులపై సంపాదించిన వడ్డీ పన్నుకు ముందు 8.25శాతం నుంచి పన్ను తర్వాత 5.75శాతంకు తగ్గుతుంది. ఖాతాదారుడు తక్కువ ఆదాయపు పన్ను శ్లాబ్ లో ఉంటే లేదా ఈపీఎఫ్ఓ అధిక వడ్డీని అందిస్తే ఈ పోస్టు ట్యాక్స్ రేటు ఎక్కువవుతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link