Income Tax Return: ఐటీ రిటర్న్స్‌కు చివరి అవకాశమిదే..లేదంటే జైలు శిక్షే

Mon, 18 Jan 2021-6:06 pm,

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్  ( IT Returns ) భర్తీ చేసేందుకు సాధారణంగా చివరితేదీ  జూలై 31 ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ గడువును ప్రభుత్వం మూడుసార్లు పొడిగించింది. వ్యక్తిగత ఐటీ రిటర్న్ దాఖలుకు జనవరి 10 చివరి తేదీగా ఉంది. ఈ గడువును మరోసారి పొడిగించాలనే డిమాండ్ వచ్చింది కానీ..ప్రభుత్వం అంగీకరించలేదు. ఈసారి కూడా రిటర్న్స్ దాఖలు చేయనివారికి మరో చివరి అవకాశం మిగిలుంది. 

నిర్ణీత తేదీ తరువాత రిటర్న్స్ దాఖలు చేసేదాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసేందుకు మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. కానీ దీనికోసం మీరు పదివేల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు రిటర్న్ దాఖలు చేసుకోగలరు. ఎందుకంటే చివరి తేదీ ముగిసిపోయింది. 

 

బిలేటెడ్ రిటర్న్స్ ( Belated returns ) విషయంలో రిఫండ్‌పై లభించే వడ్డీ మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఐటీఆర్ దాఖలు చేసే తేదీతో వడ్డీకు సంబంధముంటుంది. ఏప్రిల్ నెల నుంచి రిటర్న్స్‌పై వడ్డీ లభిస్తుంది. మీరు నిర్ణీత తేదీలోగా ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ ( Income tax )  మీకు నోటీసులు పంపిస్తుంది. మూడు నెలల నుంచి  2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడవచ్చు. ఒకవేళ మీ ట్యాక్స్ 25 లక్షల వరకూ ఉంటే..ఏడేళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది. 

ప్రతి ఏటా అసెస్‌మెంట్ ఇయర్ ఇన్‌కంటాక్స్ దాఖలు ( Income tax returns ) చేసేందుకు జూలై 31 చివరి తేదీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ తరువాత రిటర్న్స్ దాఖలు చేస్తే 5 వేల రూపాయలు పెనాల్టీ ఉంటుంది. కానీ అది కూడా మీరు డిసెంబర్ 31 వరకూ చెల్లించవచ్చు. ఆ తరువాత అంటే డిసెంబర్ 31 నుంచి మార్చ్ 31 వరకూ రిటర్న్ దాఖలు చేస్తే పది వేల రూపాయలు పెనాల్టీ చెల్లించాలి. 

ఏడాది ఆదాయం 5 లక్షల వరకూ ఉన్నవారు..మార్చ్ 31 వరకూ ఇన్ కంటాక్స్ భర్తీ ( IT Returns ) చేస్తే వారికి వేయి రూపాయల పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ , టాక్స్ రెండూ చెల్లిస్తేనే మీ రిటర్న్స్ దాఖలవుతాయి. ఏదైనా రిటర్న్స్ మీకు గుర్తు లేక భర్తీ చేయకపోతే బిలేటెడ్ రిటర్న్స్ లో పెనాల్టీ చెల్లించక తప్పదు. 

పెనాల్టీ చెల్లించడానికి ముందు వరకూ మీరు ఐటీఆర్ ( ITR ) భర్తీ చేయకపోతే అప్పటివరకూ మీ టాక్స్‌పై ప్రతి నెలా వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు వచ్చే సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు కూడా.  నిర్ణీత తేదీలోగా మీరు రిటర్న్స్ దాఖలు చేస్తే..మీకు రావల్సిన పెండింగ్ డబ్బులుంటే దానిపై కూడా వడ్డీ వస్తుంది. ఇన్‌కంటాక్స్ చట్టం ( Income tax act section 244 A ) సెక్షన్ 244 ఏ ప్రకారం మీరు  సంపాదనపై అధిక ట్యాక్స్ చెల్లిస్తే..తిరిగి పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link