MHADA Flats Lottery: రూ.40 లక్షలకే ముంబైలో ఇల్లు కొంటారా? ప్రభుత్వం అందిస్తున్న బంపర్ ఆఫర్
MHADA Flats Lottery: దేశంలోనే అతి పెద్ద నగరమైన ముంబైలో ఇల్లు కొనాలని భావిస్తున్నారా అక్కడి ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తోంది.
MHADA Flats Lottery: ప్రభుత్వ హౌసింగ్ ఏజెన్సీ మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) 2 వేలకు పైగా ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించనుంది. సెప్టెంబర్‌లో గృహాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేయనుంది.
MHADA Flats Lottery: ముంబైలో అతి ఖరీదైన ప్రాంతంలో 2,000 ఫ్లాట్లు ఇస్తుండడం విశేషం. లాటరీ పద్ధతిలో ముంబైలోని మలాడ్, పోవై, విఖ్రోలి, గోరెగావ్, వడాలా ఫాలో ప్రాంతాల్లో కేటాయించనున్నారు.
ఎన్ని ఇండ్లు MHADA Flats Lottery: మొత్తం ఇండ్లు 2,030 ఫ్లాట్లు. మధ్య తరగతి ప్రజలు (MIG) కేటగిరీ యూనిట్లు: 768 ఫ్లాట్లు | అల్పాదాయ వర్గం (LIG) యూనిట్లు: 627 ఫ్లాట్లు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ (EWS) యూనిట్లు: 359 ఫ్లాట్లు | అధిక ఆదాయ సమూహం (HIG) యూనిట్లు: 276 ఫ్లాట్‌లు
ఫ్లాట్‌లకు ఎంత ధర: MHADA Flats Lottery: అధికారుల సమాచారం ప్రకారం ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. నిర్ణీత ధరల విధానం లేదు. వస్తున్న సమాచారం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫ్లాట్‌ల ప్రారంభ ధర దాదాపు రూ.30 లక్షలు, హెచ్‌ఐజీ కేటగిరీకి సంబంధించిన అత్యధిక ధర రూ.కోటి వరకు ఉండే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ MHADA Flats Lottery: ఈ ప్లాట్లు పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పాల్గొనే ముందు కొన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. మొబైల్ నంబర్ (ఆధార్‌తో లింక్ చేయబడింది), ఇమెయిల్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జీవిత భాగస్వామి ఆధార్ కార్డ్ (వివాహం చేసుకున్నట్లయితే), జీవిత భాగస్వామి పాన్ కార్డ్ (వివాహం అయితే), నివాస ధృవీకరణ పత్రం, ఐటీఆర్ (స్వీయ), ఐటీఆర్ (భర్త), ఆదాయ ధ్రువపత్ర, కుల ధ్రువీకరణ పత్రం వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.
ఎలా ఇస్తారు? MHADA Flats Lottery: మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో అకౌంట్ తెరవాలి. పథకం కింద ఆన్‌లైన్ లాటరీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
ముఖ్యమైన తేదీలు MHADA Flats Lottery: ఆన్‌లైన్ దరఖాస్తు: 9 ఆగస్టు, 2024 దరఖాస్తుకు చివరి తేదీ: 4 సెప్టెంబర్ (11:45 PM) లాటరీ ఫలితాలు: 13 సెప్టెంబర్ (11 AM)