Posani Arrest: పోసాని అరెస్ట్ కు రంగం సిద్ధం..
Posani Krishna Murali Arrest:ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైయస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై తెలుగు రాష్ట్ర యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ పై రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులను నోటికి వచ్చినట్టు దుర్భాష లాడారు.
రీసెంట్ గా పోసాని కృష్ణమురళి.. ఏపీ చంద్రబాబుపై అసత్య వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టించడంతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్ కు భంగం కలిగేలా పోసాని అనరాని మాటలన్నారు.
చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠ భంగం కలిగేలా పోసాని చేసిన వ్యాఖ్యలు .. వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నేతలు సోషల్ మీడియా వేదికగా తమపై చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కీలక బిల్లును తీసుకురానున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీన్ని ఆమోదించనున్నట్టు సమాచారం.