Zinc Rich Foods: జింక్ లోపముంటే శరీరంలో ఏం జరుగుతుంది, ఏయే పదార్ధాలు తీనాలి

Sat, 21 Sep 2024-8:58 pm,

శెనగలు

శెనగల్లో జింక్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ప్రోటీన్లు, ఫైబర్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. 

జీడిపప్పు

శరీరంలో జింక్ లోపాన్ని సరి చేసేందుకు తీసుకోవల్సిన ముఖ్యమైన పదార్ధాల్లో జీడిపప్పు ఒకటి. ఇందులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఇలా చాలా ఉంటాయి. ఇవి శరీరం హెల్తీగా ఉండేందుకు దోహదపడుతుంది. జింక్ లోపం సరి చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది

రాజ్మా

ఇక చాలామంది ఇష్టంగా తినే రాజ్మాలో జింక్ శాతం చాలా ఎక్కువ. ఉత్తరాదిన ఇదొక ప్రసిద్ధ డిష్. శాకాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. ఇందులో జింక్‌తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా ఉంటాయి.

ఆనపకాయ గింజలు

ఆనపకాయ గింజల్లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది. జింక్ ఒక్కటే కాకుండా ఇందులో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని చాలా లాభాలున్నాయి. రోజూ ఆనపకాయ గింజలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. 

డార్క్ చాకొలేట్

జింక్ లోపాన్ని సరి చేసే అద్భుతమైన పదార్ధం డార్క్ చాకోలేట్. కోకోతో చేసే డార్క్ చాకోలెట్‌లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా చాలా ఎక్కువ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link