Snake Fights with Small Animals: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. పాముకాటు ఏ జంతువు కైనా, మనుషులకైనా ప్రాణాపాయం లాంటిదే. ప్రపంచంలో చాలా రకాల జాతులకు చెందిన అతి భయంకరమైన పాములు ఉన్నాయి. ఈ పాముల్లో కింగ్ కోబ్రా జాతికి చెందిన పాము ఒకటి. ఇది దాదాపు 5 నుంచి 11 అడుగుల దాకా ఉంటుంది. చూడడానికి నల్లగా భయంకరంగా పడక విప్పుతూ బుసలు కొడుతూ ఉంటుంది. అయితే ఇవి ఇతర జంతువుల మీదికి దాడికి దిగడం సహజం. కానీ వీటి పైకి దాడికి దిగే జంతువులను మీరు ఎప్పుడైనా చూశారా? మీకు సందేహం కలగవచ్చు కింగ్ కోబ్రాల పై కూడా దాడికి దిగే జంతువులు ఉన్నాయా అని? ఈరోజు మేము చూపించే వీడియో మీ అందరిని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రాలు ఇతర జంతువుల పైకి దాడికి దిగి చంపడం సర్వసాధారణం. ఈ 11 గల అడుగుల పాములు సైలెంట్ గా దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే ఇతర జంతువులపై దాడి చేసే క్రమంలో కోబ్రా నుంచి ఎలాంటి శబ్దం వినిపించదు. కొన్ని పాములు ఇతర జంతువుల పై దాడి చేసే క్రమంలో వాటిని రక్షించుకునేందుకు.. పాములతో సైతం జంతువులు దాడికి దిగుతాయి. తరచుగా మనం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే. కింగ్ కోబ్రాలు దాడి చేసినప్పుడు వాటి నుంచి ఆ జంతువులు వాటినవే ఎలా రక్షించుకున్నాయో తెలిపేదే ఈ వీడియో. ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



పాము కాటు నుంచి దీటుగా ఎదుర్కొనే వాటిల్లో ముంగిసలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి చూడడానికి కుందేలు ఆకారంలో ఉంటాయి. ఈ ముంగిసలు దాడి చేస్తున్న పాములను సులభంగా పసిగడతాయి. అంతేకాకుండా ఆ కాటు నుంచి సురక్షితంగా బయటపడి.. తిరిగి దాడి చేసే తత్వం కలిగి ఉంటాయి. అందుకే ముంగిసలను యాంటీ పాములుగా పేర్కొన్నారు. 


రాబందులు కూడా పాముల దాడిని సులభంగా ఎదుర్కొంటాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలను సైతం ఆహారంగా తీసుకుంటాయి. ఈ రాబందులు నివసించే చోట పాములు అస్సలు జీవనం సాగించలేదని సమాచారం. రాబందులతోపాటు గ్రద్దలు కూడా పాములను తినే శక్తిని కలిగి ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో గ్రద్దలు పాములను పొడుచుకుని తింటున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో పాములు దాడులకు దిగినప్పుడు వాటి గురి మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకే దృశ్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి