20 Feet Heavy Giant King Cobra Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో మనుషుల వీడియోల కంటే ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులు కింగ్ కోబ్రా పాములకి సంబంధించిన వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. స్నేక్ క్యాచర్స్ వారు పట్టిన పాములను నెట్టింట షేర్ చేయడంతో అవి తెగ వైరల్ గా మారుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలు కొందరిని భయాందోళనకు గురి చేస్తే.. మరికొందరిని ఆశ్చర్యపరచుతున్నాయి. ఇటీవల థాయిలాండ్ లోని ఓ స్నేక్ క్యాచర్ 4.5 మీటర్ల కింగ్ కోబ్రా ను పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలోకి వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.



పాములు పట్టడంలో వావా సురేష్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో.. అందరికీ తెలిసిందే.. ఇలాంటి వావా సురేష్ థాయిలాండ్ లో కూడా ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద పాములనైనా సులభంగా చాకచక్యంగా పట్టుకోగలుగుతాడు. ప్రస్తుతం ఈ తైవాన్ కు సంబంధించిన వావా సురేష్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లోని ఓ ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులు పాము దూరగా.. ఆయన సమాచారం మేరకు అక్కడికి చేరుకుంటాడు. 


Also Read: Trending video: వాటర్ బాటిల్ తో ఉడుత దాహం తీర్చిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..


ఆ పరిసరాల్లో భారీ కింగ్ కోబ్రా ను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇలా పట్టుకునే క్రమంలో ఆయనను కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ స్నేక్ క్యాచర్ ఏడుసార్లు పాము కాటు నుంచి తప్పించుకుంటాడు. ఇలా 20 నిమిషాల పాటు పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.. చివరకు పాము తలను పట్టుకుని సంచిలో బంధిస్తాడు.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. థాయిలాండ్ స్నేక్ క్యాచర్ పాములు పట్టుకోవడాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఆయనను ఇలా ప్రశంసించారు.. పాములు పట్టుకోవడం గొప్ప నైపుణ్యమని, వాటిని కాపాడడంలో స్నేక్ క్యాచస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు ఎప్పటికీ మరువలేమని స్థానికులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి