Viral Video: అరరె.. చేపలను బుడ్డోడు భళే పట్టాడే! విజయ రహస్యం చెప్పిన ఆనంద్ మహీంద్రా
A Boy catch fishes with simple equipment. బుడతడు చేపలు పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేసిన మహీంద్రా విజయ రహస్యం కూడా చెప్పారు.
A Boy catch fishes with simple equipment, Anand Mahindra shares Video: ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. వ్యాపార నిర్వహణ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం మిస్ కారు. తన దృష్టికి వచ్చి ప్రతిభను దేశంలో ఏ మూలన ఉన్నా ప్రోత్సహించడంలో అందరికంటే ముందుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. తాజాగా తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ బుడ్డోడి పతిభకు ఫిదా అయ్యారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియోలో ఓ బుడతడు చేపలు పట్టాడు. చేపలు పట్టేందుకు ఆ బాలుడు ఉపయోగించిన టెక్నిక్ బాగుంది. ముందుగా చేపలు పట్టేందుకు బుడతడు కాల్వ గట్టుకు వెళతాడు. ఒడ్డున ఒక గిలక చట్రాన్ని బిగించి.. గాలానికి పిండి ముద్దలను ఉంచుతాడు. ఆ గాలాన్ని నీళ్లల్లోకి విసిరిన బాలుడు.. ఒడ్డున ఓపికగా కూర్చుంటాడు. కొద్దిసమయం తర్వాత గాలానికి ఉన్న తాడు నీటిలోకి దూసుకెళుతుంటుంది. ఇది గమనించిన బాలుడు.. గిలక సాయంతో గాలాన్ని నీటి నుంచి వెనకకు లాగుతాడు. చివరకు గాలానికి చిక్కుకున్న రెండు పెద్ద చేపలు ఒడ్డుకు చేరుకుంటాయి. ఇంకేముందు ఆ రెండింటిని తన సంచిలో వేసుకుని ఆనందంగా ఇంటికెళతాడు.
బుడతడు చేపలు పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దాన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేసిన మహీంద్రా విజయ రహస్యం కూడా చెప్పారు. 'వ్యాఖ్యానం లేకుండా నా ఇన్‌బాక్స్‌లో చుడండి. రోజురోజుకి పెరుగుతున్న ఈ సంక్లిష్ట ప్రపంచంలో ఈ దృశ్యాన్ని చూడటానికి వింతగా, ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో ద్వారా ఓ విషయం తెలుసుకోవాలి. సంకల్పం, చాతుర్యం, సహనం కలిస్తేనే విజయం దక్కుతుంది' అని పేర్కొన్నారు. ఈ వీడియోకి ఒక్క రోజులోనే ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్, 90 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook