శీతాకాలం (Winter) చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు (Siberian Birds) భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో ఈ కాలంలో సందడి చేస్తాయి. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకంగా మారిపోతుంది. చూసేందుకు రెండు కళ్లు చాలవు అనేలా రమణీయమైన దృశ్యాలు కనిపిస్తాయి.



 


తాజాగా రష్యాలోని సైబీరియన్‌ వలస పక్షులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Siberian Birds At Prayagraj) తీరానికి చేరుకున్నాయి. త్రివేణి సంగమం వద్ద వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. సైబీరియన్ పక్షులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది వారణాసికి సైతం వారం రోజులు ముందుగానే సైబీరియన్ కొంగలు వలస వచ్చాయి. గంగా నది తీర ప్రాంతాల ఘాట్లు ఆహ్లాదకరంగా మారిపోతున్నాయి. 



 



 


త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద ఆ సుందర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైబీరియన్ పక్షుల రాకతో ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంది. సంగమం వద్ద సైబీరియన్ పక్షులను వీక్షించేందుకు భారీగా స్థానికులు తరలివస్తున్నారు. కొందరు ఆ పక్షులకు గింజలు, ఆహారం చల్లుతున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe