Zomato Order Cocroach: హోటల్‌ నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్‌ బాగానే ఉంటది కానీ వంట వండే కిచెన్‌, ఇతర గదులు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. దీని ఫలితంగా పార్సిల్‌ ఆర్డర్‌ చేస్తే చచ్చిన పురుగులు దర్శనమిస్తున్నాయి. తినడానికి పార్సిల్‌ ఓపెన్‌ చేస్తే పురుగులను చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దీని ఫలితంగా ఆ పార్సిల్స్‌ చూడగానే వాంతులు చేసుకునే పరిస్థితి దాపురించింది. తాజాగా మరో చోట జొమాటో ఆర్డర్‌లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దీనివలన హోటల్‌ నిర్వాహకులపై, జొమాటో తీరుపై ఆ కస్టమర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!


త్రిపుర రాజధాని అగర్తలకు చెందిన సోనాయి ఆచార్య తనకు ఇష్టమైన జపనీస్‌ రమెన్‌ అనే ఆహారాన్ని జొమాటోలో ఆర్డర్‌ చేసింది. ఆంటీ ఫగ్స్‌ అనే హోటల్‌ నుంచి ఆర్డర్‌ వచ్చింది. వచ్చిన పార్సిల్‌ తీసుకుని తెరచింది. తినడానికి ప్రయత్నించగా చచ్చిపోయిన బొద్దింక కనిపించింది. దీంతో సోనాయి యాక్‌ అని అసహ్యించుకుంది. మంచి ఆహారం అని తిందామనుకుంటే ఇలాంటి దరిద్రపు సంఘటన జరగడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు వచ్చిన పార్సిల్‌లో బొద్దింక ఫొటోలను 'ఎక్స్‌'లో పంచుకుంది. హోటల్‌ ఆహారంలో నాణ్యత విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఉంటే ఎలా తినాలని ప్రశ్నించింది. ఇది సహించలేనిది అంటూ మండిపడింది. ఈ సందర్భంగా జొమాటోకు, హోటల్‌ ఆంటీ ఫగ్స్‌పై కూడా ఫిర్యాదు చేసింది.

Also Read: Manikandan Awards Robbery: దొంగల్లో వీళ్లు మంచి దొంగలు.. సినిమా దర్శకుడి అవార్డు తిరిగిచ్చిన దొంగలు


'జొమాటో ఆర్డర్‌తో దరిద్రమైన అనుభవం కలిగింది. ఆంటీ ఫగ్స్‌ హోటల్‌ నుంచి ఆర్డర్‌ చేసిన జపనీస్‌ మిసో రమెన్‌ చికెన్‌లో బొద్దింక కనిపించింది. ఇది క్షమించరానిది. ఆహార నాణ్యతలో ఇది తీవ్ర నిరాశకు గురి చేసింది. జొమాటో స్పందించి చర్యలు తీసుకోవాలి' అని సోనాయ్‌ ఆచార్య 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో జొమాటో కేర్‌ స్పందించింది. 'ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. మీకు కలిగిన అసౌకర్యంపై చర్యలు తీసుకుంటాం. మాకు కొంత సమయం ఇవ్వండి. వీలైనంత త్వరలోనే మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం' అని జొమాటో బదులిచ్చింది. జొమాటో స్పందనతో సోనాయి వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆహార నాణ్యత అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తోంది.
 



కాగా దేశంలో తరచూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. వారం వ్యవధిలో ఇలా చోటుచేసుకోవడం రెండోది. హోటల్‌ నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టమొచ్చిన రీతిలో ఆహార పదార్థాలు వండుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భోజనం తయారీ సమయంలో శుచీ శుభ్రత పాటించకుండా వండుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తరచూ హోటళ్లను సందర్శించాలని కోరుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook