Air Hostess Dance for Sara Ali Khan's Song: బాలీవుడ్ అప్‌కమింగ్ మూవీ 'ఆత్రంగి రే' (Atrangi Re) సినిమాలోని 'చకా చక్' సాంగ్ (Chaka Chak Song) ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రెహమాన్ మ్యూజిక్ (AR Rehaman) అందించిన ఈ పాటకు సారా అలీఖాన్ (Sara Ali Khan) స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లిన చకా చక్ పాట వినిపిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా స్పైస్ జెట్‌కి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ ఈ క్యాచీ సాంగ్‌కి చేసిన స్టెప్పులేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమా మీనాక్షి అనే ఆ ఎయిర్ హోస్టెస్ (Airhostess Dance Video) బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్‌లో 'చకా చక్' పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఖాళీ విమానంలో ఆమె ఒక్కరే హుషారుగా కాలు కదిపారు. రెండు రోజుల క్రితం ఈ వీడియోను ఉమా మీనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా... ఇప్పటివరకూ 5వేల పైచిలుకు లైక్స్, వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. మీనా డ్యాన్స్ అదరగొట్టేశారంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యోహనీ అనే ఓ ఎయిర్‌ హోస్టెస్ కూడా ఇలాగే స్టెప్పులు వేయగా... ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.


ఇక ఆత్రంగి రే సినిమా విషయానికి వస్తే... సారా అలీ ఖాన్ (Sara Ali Khan), ధనుష్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. రెహమాన్ సంగీత సారథ్యంలో, టీ-సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఆత్రంగి రే తెరకెక్కింది. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



 


Also Read: Diego Maradona Watch:మారడోనా లగ్జరీ వాచీ-దుబాయిలో చోరీ-ఇండియాలో దొరికింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook