Flight stuck under bridge: బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. Watch viral video
Flight stuck under bridge, Watch this viral video: ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో ఒకటి నిన్న ఆదివారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో విమానం ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి ఉండగా.. ఆ పక్కనుంచే రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు.
Flight stuck under bridge, Watch this viral video: ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో ఒకటి నిన్న ఆదివారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో విమానం ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి ఉండగా.. ఆ పక్కనుంచే రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు (Delhi Airport) సమీపంలో ఢిల్లీ-గురుగావ్ హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. సినిమా స్టైల్లో వైరల్ అయిన ఈ వీడియోపై ఎయిర్ ఇండియా సైతం స్పందించింది.
కాలం చెల్లిన విమానాన్ని తుక్కు (Air India flight scrapped) కింద విక్రయించగా.. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానిని తరలిస్తుండగా చోటుచేసుకున్న ఘటన ఇది అంటూ ఎయిర్ ఇండియా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన విమానాన్ని రోడ్డు మార్గంలో ఎలా తరలించడం అనేది పూర్తిగా కొనుగోలుదారుకు చెందిన అంశమని.. ఇందులో తమకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టంచేశారు.
Also read : Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు కాస్తాయ్!.. తీసుకుంటే వ్యాధులు వస్తాయ్..!
ఆ విమానానికి కాలం చెల్లిపోవడంతో దానిని స్క్రాప్ (Flight sold under scrap) వ్యాపారికి విక్రయించినట్టు ఎయిర్ ఇండియా సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది. ఒకసారి విమానం అమ్మడం జరిగాకా.. ఆ తర్వాత ఆ విమానంతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చిచెప్పారు. ఎయిర్ ఇండియాపై (Air India) నెటిజెన్స్ పలు జోక్స్, మీమ్స్ వైరల్ చేస్తున్న కారణంగానే సంస్థకు ఈ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Also read : Horrifying Video: నిప్పంటుకున్న మహిళ జుట్టు.. 45 సెకన్ల వరకు పట్టించుకోకుండా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook