Air India: టాటా సన్స్‌ కంపెనీ చేతిలోకి ఎయిర్‌ ఇండియా

Tata Sons selected as winning bidder: పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్‌ఇండియాలో వంద శాతం వాటాలను కేంద్రం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపు సంస్థ విజేతగా నిలిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 01:39 PM IST
  • టాటా గ్రూపు చేతిలోకి ఎయిర్‌ ఇండియా
  • ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిర్‌ ఇండియా ప్రైవేట్‌పరం
  • బిడ్లను ఆహ్వానించగా... విజేతగా నిలిచిన టాటా సన్స్
 Air India: టాటా సన్స్‌ కంపెనీ చేతిలోకి ఎయిర్‌ ఇండియా

Air India disinvestment-Tata Sons selected as winning bidder: ఎయిర్‌ ఇండియా టాటా సన్స్‌ (Tata Sons) కంపెనీ చేతిలోకి వెళ్లనుంది. ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిర్‌ ఇండియా (Air India) ప్రైవేట్‌పరంకానుంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్‌ఇండియాలో వంద శాతం వాటాలను కేంద్రం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా సన్స్‌ సంస్థ విజేతగా నిలిచింది. దీంతో ఎయిర్‌ ఇండియా విమానాలతో పాటు ఎయిర్‌ ఇండియాకు చెందిన స్థిర, చర ఆస్తులన్నీ టాటా గ్రూపుకు (tata group) దక్కనున్నాయి. అయితే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం (central government) రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది.

స్సైస్‌ జెట్‌ కంటే ఎక్కువగా..

ఎయిర్‌ ఇండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించగా.. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్‌తో పాటు స్పైస్‌ జెట్‌ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. అయితే స్సైస్‌ జెట్‌ (spicejet) కంటే దాదాపు రూ.3,000 కోట్లను అదనంగా చెల్లించేందుకు టాటా గ్రూపు ముందుకు రావడంతో కేంద్ర మంత్రి అమిత్‌షా నేతృత్వంలోని మంత్రుల బృందం టాటా గ్రూపునకు (tata group) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Also Read : Kondapolam movie: కొండ పొలం మూవీకి Censor పూర్తి

అధికారిక ప్రకటన రాలేదు

అయితే ఎయిర్‌ ఇండియా (Air India) టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనున్న విషయంపై ప్రభుత్వం గానీ, టాటా సన్స్‌ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్నది స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : Telangana Assembly Sessions: పంచాయతీల నిధుల మళ్లింపుపై కేసీఆర్ స్పష్టత.. సభలో తాము ఎవరి గొంతు నొక్కమని వెల్లడి

68 ఏళ్ల తర్వాత వారి చేతుల్లోకే

ఎయిరిండియాను దక్కించుకోవడంలో టాటా సంస్థ ముందు నుంచి ఆసక్తికరంగా ఉంది.అలాగే సంస్థ పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమకూర్చే సత్తా కూడా టాటా కంపెనీకి ఉంది. వీరికి విమానయాన రంగంలో కూడా మంచి అనుభవం ఉంది. ఎయిరిండియాను ప్రారంభించింది టాటా కంపెనీనే. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరిట టాటా గ్రూప్‌ విమానయాన రంగంలోకి ప్రవేశించింది. జంషెడ్‌జీ టాటా (jamshedji tata) 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్‌ ఇండియా పేరు మార్చారు. అయితే 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని (airlines) కేంద్రం జాతీయం చేసింది. 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. తిరిగి 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకే వెళ్లనుంది. డిసెంబరు నాటికి ఎయిరిండియాలో (Air India) ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూరయి.. ఎయిరిండియా కొత్త యజమాని అయిన టాటా సంస్థ (tata group) చేతుల్లోకి వెళ్లిపోనుంది.

Also Read : Funny Dance Video:ఆఫ్రికన్ వధువు-ఇండియన్ వరుడు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News