Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు కాస్తాయ్!.. తీసుకుంటే వ్యాధులు వస్తాయ్..!

Money Tree in UK: మనం ఎవరినైనా డబ్బులు కోసం ఎక్కువ సతాయించామంటే...ముందుగా వచ్చే మాట..ఏరా ఇంట్లో చెట్లకు ఏమైనా డబ్బులు కాస్తున్నాయా అనుకుంటున్నావా..అని జవాబిస్తారు. ఒకవేళ నిజంగానే చెట్లకు డబ్బులు కాస్తే..వావ్ అనాల్సిందే. ఇలాంటి ఘటనే యూకేలోని ఒ గ్రామంలో చోటుచేసుకుంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2021, 01:19 PM IST
  • యూకేలో వింత చెట్లు
  • అక్కడి చెట్లకు డబ్బులు
  • వాటిని తీస్తే అనారోగ్యం వస్తుందని నమ్మకం
Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు కాస్తాయ్!.. తీసుకుంటే వ్యాధులు వస్తాయ్..!

Money Tree in UK:  బ్రిటన్ లోని ఒక గ్రామంలో చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తున్నాయ్ అనిపిస్తుంది. అవును ఆ విలేజ్ లోని చెట్ల నిండా కాయిన్స్ ఉంటాయి. ఒకొక్క చెట్టుకు వేల రూపాయల నాణేలు ఉంటాయి. అయితే ఈ చెట్ల నుంచి ఒక్క కాయిన్ తీసుకోరు. తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయరు. అలా ఎవరైనా తీసుకుంటే.. వారిని దరిద్రం వెంటాడుతాదని ఆ గ్రామస్థుల నమ్మకం.

వివరాల్లోకి వెళితే..

యూకే(UK)లో కొండలపైన 'పోర్ట్ మేరియన్' అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని పెద్ద పెద్ద చెట్లు పడిపోయినట్లుగా కిందకు వాలి ఉంటాయి. అయితే ఆ చెట్లపై చాలా నాణాలు(Coins) ఉంటాయి. ఇలా ఈ చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయట. అంతేకాదు.. ఆ చెట్ల(Trees)కు దిగబడి ఉన్న నాణేల్లో చాలా ఇప్పడు చెలామణీలో లేవు.  ఈ నాణాల చెట్లను చూసేందుకే పర్యాటకులు(Tourists) ప్రత్యేకంగా వెళతారు. 2011 సంవత్సరంలో ఈ చెట్ల నాణేలు గురించి ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చింది. అప్పుడు పరిశోధకులు రంగంలోకి దిగి.. ఇలా చెట్లకు ఎవరు, ఎందుకు నాణాలను మేకుల్లా దిగకొట్టారని తెలుసుకునేందుకు  అన్వేషణ మొదలు పెట్టారు. చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడారు.. ముఖ్యంగా పెద్దవారితో నాణేల(Coin) చెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read: Viral: టర్కీలో వింత సంఘటన...కనిపించడం లేదంటూ తనను తానే వెతుకున్న వ్యక్తి..

డబ్బు చెట్టు-మూఢనమ్మకం:

ఈ డబ్బుల చెట్లు స్థానికుల పురాతన సంప్రదాయం(Ancient tradition), మూఢనమ్మకాల(Superstition) వల్ల ఏర్పడ్డాయి. చెట్టు కాండం లోపల నాణెంను దిగ్గొడితే.. ఆ వ్యక్తులకు  అదృష్టం కలిసి వస్తుందని.. మంచి ఆరోగాన్ని ఇస్తుందని కొంతమంది నమ్మకం. ముఖ్యంగా అనారోగ్యం(Illness)తో ఉన్న వ్యక్తి చెట్టులో నాణెం నొక్కితే అది వారి అనారోగ్యాన్ని దూరం చేస్తుందని స్థానికుల నమ్మకం. అంతేకాదు.. ఎవరైనా ఆ నాణేన్ని తిరిగి చెట్టు నుంచి బయటకు తీయాలని చూస్తే అటువంటివారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని కొందరు నమ్ముతారు.

ఎలా మొదలైందంటే:

చెట్లలో నాణేలను పెట్టె సంప్రదాయం 1700 లలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ చెట్లలో ఉన్న నాణేలు ఎక్కువగా అప్పటికి చెందిన రెండణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పోర్ట్ మేరియన్ గ్రామస్థులు అప్పట్లోనే చెట్లను దేవతలుగా భావించేవారని తెలుస్తోంది. ఆ కాలంలో ఈ చెట్లని వారు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా కొలిచేవారు. దీంతో ఎవరైనా వ్యాధ్యుల బారిన పడితే.. మొక్కుకుని ఇలా ఒక నాణెం తీసుకుని చెట్టుకు మేకులా కొట్టేవారు. దీంతో ఇలా వేలాది మంది చేయడంతో చెట్లన్నీ నాణాలతో నిండిపోయాయి. అప్పటి ప్రజల్లో అనారోగ్యం పాలైన వ్యక్తి తన చేతులతో తానే ఆ నాణాన్ని చెట్టుకు కొట్టాలన్న నమ్మకం కూడా ఉండేదట . ఆ నాణాన్ని ఎవరైనా లాగే ప్రయత్నం చేస్తే రోగాలబారిన పడతారని నమ్మేవారు. అందుకే వాటిని తీయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇదే విషయంపైనా గ్రామంలోని నేటి జనరేషన్ మాట్లాడుతూ.. తమకు ఇప్పుడు ఆ నమ్మకాలు, ఆచారాలు లేవని.. చెబుతున్నారు. అయితే అప్పట్లో ఇలా చెట్లకు నాణేలు దింపడంవలన ఎంతవరకూ రోగాలు నయం అయ్యాయో తెలియదు కానీ.. ఈ చెట్లు చూడగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఫీలింగ్ కలుగుతుందని పర్యాటకులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News