Alwal Road Rage Viral Video‌‌: ఒక్క మాట అంటేనే విచక్షణ కోల్పోతున్నారు. మాటామాటా పెరిగి ప్రాణాలు తీస్తున్నారు. చివరకు నిందితులుగా మిగిలిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హైదరాబాద్‌ అల్వాల్‌లో జరిగిన ఓ ఘటన ఇలాంటిదే. రోడ్డు దాటటానికి వేచి ఉన్న ఓ పెద్దాయన కేవలం మెల్లగా వెళ్లమన్న పాపానికి ఓ బైకర్‌ అతడి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఇటీవలె చోటుచేసుకుంది. ఆ పెద్దాయనై విచక్షణారహితంగా దాడి చేయడంతో గురువారం ప్రాణాలు వదిలాడు. అక్కడ దగ్గరలోనే ఉన్న ఓ సీపీటీవీ ఫూటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో రికార్డు ప్రకారం. సెప్టెంబర్‌ 30న ఓ 65 ఏళ్ల పెద్దాయన అల్వాల్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే బైక్‌పై భార్యా, బిడ్డతో వెళ్తున్న ఓ దుర్మార్గుడు ముసలాయన వైపుగా దూసుకు వచ్చాడు. దీంతో పెద్దాయన చూసుకుని వెళ్లమని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన బైకర్‌ బండిని పక్కకు ఆపాడు. భార్య వద్దని చెప్పి పట్టుకుంటున్నా వినకుండా వెళి పెద్దాయనపై దాడికి దిగాడు. చేయి చేసుకుంటూ రెండుసార్లు తోసేసాడు. దీంతో ఆయన తల నేలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చుట్టుటుట్టు వెహికల్స్‌ వచ్చి ఆగడంతో ఆ దుర్మార్గుడు బండి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


ఇదీ చదవండి: TDP Leader Video: మరో టీడీపీ నేత రాసలీలలు..రాత్రికి వస్తేనే పింఛన్ అంటున్న రసిక రాజా.. వీడియో దొరికేసింది..


వెంటనే స్థానిక ఆస్పత్రిలో పెద్దాయనను చేర్చారు బంధువులు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. లక్షలు ఖర్చు పెట్టి చికిత్స అందించిన బతకలేదని బంధువులు వాపోతున్నారు. పెద్దాయన మృతికి కారణమైన ఆ వ్యక్తి ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి బంధువులు కేసు నమోదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు హాజరుపర్చారు. ప్రస్తుతం నిందితుడిని జ్యూడిషియల్‌ కస్టడీకి తీసుకున్నారు. కేసు విచారణ చేపడుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. బంధువులు మాత్రం పెద్దాయన మృతికి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెట్టిజెన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


 




 


సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ గా మారతాయి.  మొన్న హైదరాబాద్‌లోని మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద చిరుత సంచరిస్తుందని స్థానికులు వీడియో తీయగా ఆ కాస్త వీడియో వైరల్‌ అయింది. చివరకు అది చిరుత కాదు అడవి పిల్లి అన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. స్థానికులు కాస్తు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సీసీ టీవీలు అనేక సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. లేకపోతే చట్టం నుంచి ఎంతమంది దోషులు తప్పించుకునేవారో ఊహించుకుంటేనే భయంగా ఉంది.


ఇదీ చదవండి: శని కుజుల కలయికతో ఏర్పడిన షడష్టక యోగం.. ఈ రాశికి వైవాహిక బంధంలో విభేదం..!    


ఇదీ చదవండి:  రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter