Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..

Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇది అక్టోబర్‌ 23న తీవ్ర వాయుగుండంలో మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత అది తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
 

1 /5

అంతేకాదు ఈనెల 29వ తేదీనా నవంబర్ 3వ తేదీనా కూడా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, రేపు అల్పపీడనం ఏర్పడితే మాత్రం రానున్న 5 రోజులు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి.  

2 /5

ఈ తుఫాను ఒడిశా, లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందని వివరించింది. అది 24 నుంచి 26 తేదీ మధ్యన జరగవచ్చని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ప్రభావితం ప్రాంతాల్లోని మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.  

3 /5

అక్టోబర్‌ 22న ఏర్పడే అల్పపీడనం వాయువ్య దిశలో పయనించి 24కు వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడవచ్చు.  

4 /5

ఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ తీర ప్రాంతాలు తడిసి ముద్దాయ్యాయి. అండమాన్‌ సముద్రంపై ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణపై కూడా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చెన్నై కూడా వాయుగుండం ప్రభావం వల్ల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తమిళనాడుపై దీని ప్రభావం బాగా పడింది.  

5 /5

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనతో అలెర్ట్‌ చేస్తూనే ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు స్కూళ్లు కాలేజీలకు సైతం సెలవులు ప్రకటిస్తోంది. గత నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో విద్యాలయాలకు కూడా భారీగానే సెలవులు వచ్చాయి.