Shadashtak Yoga: శని కుజుల కలయికతో ఏర్పడిన షడష్టక యోగం.. ఈ రాశికి వైవాహిక బంధంలో విభేదం..!

Shadashtak Yoga By Shani-mars: గ్రహాల మార్పు వల్ల ప్రతి 12 రాశుల్లో ఏదో ఒక ప్రభావం పడుతుంది. అయితే ఈ రోజు అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో అక్కడ షడష్టక యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులకు వైవాహిక జీవితంలో విభేదాలు ఎదురవవచ్చు.
 

1 /8

అక్టోబర్ 20 అట్లతద్దితో పాటు కార్వా చౌత్ కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకను ఉత్తరాదిలో నిర్వహిస్తారు. అయితే ఈ రోజున గ్రహాల మార్పు కూడా చోటుచేసుకోనుంది. ఈరోజు కర్కాటక రాశిలోకి అంగారకుడు ప్రవేశిస్తాడు. అక్కడే ఉన్న శని దేవుడు కూడా కలిసి షడాష్టక యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వైవాహిక జీవితంలో విభేదాలు ఏర్పడతాయి ఇందులో మీ రాశి కూడా ఉందా ?ఒకసారి చెక్ చేయండి.  

2 /8

సాధారణంగా కుజ గ్రహం అంటేనే లగ్జరీ లైఫ్ కి నిదర్శనం. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు శుభాలు జరిగితే మరికొన్ని రాశులకు ఆశుభాలు జరుగుతాయి. ఈ షడష్టక యోగ ప్రభావం వచ్చే ఏడాది 23వ తేదీ వరకు ఉంటుంది.  

3 /8

మేష రాశి.. షడష్టక యోగం వల్ల మేషరాశి వారికి ఆకస్మిక కోపం పెరుగుతుంది. అంతేకాదు వీరు ఆర్థికంగా బలపడతారు. కానీ తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ శని కుజుల కలయిక షడష్టక యోగం వల్ల వైవాహిక జీవితంలో మేష రాశి వారికి కూడా విభేదాలు ఏర్పడవచ్చు.

4 /8

వృషభ రాశి.. శని కుజుల కలయిక వల్ల వృషభ రాశి ప్రేమ బంధం లో కూడా చీలిక రావచ్చు. అయితే కొన్ని విధాలుగా వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా పోటీలో విజయం సాధిస్తారు అయితే కోపం నియంత్రణలో ఉంచుకోవాలి.

5 /8

మిథున రాశి.. షడష్టక యోగం వల్ల మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. కానీ పిల్లల విషయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాదు వారు పూనుకున్న పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి.

6 /8

కర్కాటక రాశి.. నేడు ఏర్పడుతున్న షడష్టక యోగం వల్ల కర్కాటక రాశికి కూడా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కుజుడు కర్కాటక రాశిని అత్యల్పరాశిగా పరిగణిస్తాడు. వారికి అన్ని విధాలుగా శుభాలు ఇవ్వలేడు. ముఖ్యంగా ఈ సమయంలో కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. ఈ సమయంలో వారు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడతారు.

7 /8

సింహరాశి.. సింహ రాశి వారు కూడా తండ్రి ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోండి. షడష్టక యోగం వల్ల సింహ రాశి వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు మానుకుంటే మంచిది ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచాలి.

8 /8

కన్యా రాశి.. శని కుజుల కలయిక వల్ల కన్యా రాశి వారికి కూడా జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x