Amazon prime day Sale: ఆన్‌లైన్ షాపర్స్‌కు గుడ్‌‌న్యూస్. అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో ముందుకొస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మళ్లీ వస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను అమెజాన్ సంస్థ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)మరోసారి భారీ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. జూలై 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రైమ్ డే సేల్ జరగనుంది. జూన్ నెలలో నిర్వహించాల్సిన ఈ ప్రైమ్ డే సేల్..కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.ఇప్పుడు జూలైలో అంటే ఈ నెలలో రెండ్రోజులపాటు నిర్వహించనుంది అమెజాన్. ఈ ఆఫర్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది.


అమెజాన్ ప్రైమే డే సేల్(Amazon prime day sale) నాడు డిస్కౌంట్ లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితా కూడా విడుదలైంది. డిస్కౌంట్ ధరలతో లభించనున్న వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జి, రెడ్‌మి నోట్ 10 ఎస్, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 , వన్‌ప్లస్ 9 ఆర్ 5జి, రెడ్‌మి నోట్ 10 ఫోన్లను అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శాంసంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5జి, ఎంఐ 10ఐ 5జి, ఐక్యూ 7 లెజెండ్ ఫోన్లపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ఇస్తోంది. ధరల్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రైమ్ డే సేల్‌లో దాదాపు 40 శాతం వరకూ డిస్కౌంట్ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్స్‌(Amazon prime members)కు మాత్రం ప్రైమ్ సేల్ డేకు రెండ్రోజుల ముందే ధరల్ని అందుబాటులో ఉంచనుంది.


Also read: WhatsApp Features: మీరు వాట్సాప్ వాడుతున్నారా, అయితే ఈ సరికొత్త ఫీచర్లు మీకోసమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook