Viral Video: సోషల్ మీడియా(Social Media)లో జంతువుల(Animals)కు సంబంధించిన వీడియోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏనుగు(elephant) ఎంత శాంతంగా ఉంటుందో...కోపం వస్తే అంతే బీభత్సం సృష్టిస్తోంది. గజరాజును  చూస్తే అడవికి రాజైన సింహం కూడా బెదిరిపోవాల్సిందే. ఇక మనుషుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని చూస్తేనే బెదిరిపోతారు.. ఇదిలా ఉంటే.. ఏనుగులకు మనసు, మానవత్వం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతటి దయగల ఏనుగులకు కోపం వస్తే.. వాటిని ఆపడం ఎవరితరం కాదు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో(Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.


Also read: Bride Wears 60 Kgs Gold : అరవై కేజీల బంగారంలా మారిన పెళ్లి కూతురు


వైరల్ వీడియో ప్రకారం.. కోపంతో ఉన్న గజరాజుల మంద జనావాసాల్లో వచ్చినట్లుగా మీరు చూడవచ్చు. ఇక ఆ మందలోని ఓ ఏనుగు తన కోపాన్ని ఒక కారు(Car)పై చూపించింది. దాన్ని అమాంతం ఎత్తి పడేసింది. అంతేకాకుండా తొండంతో ఆ కారును తోస్తూ రచ్చ.. రచ్చ చేసింది. ఈ వీడియోను చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు. ”ఏనుగులకు కోపం వస్తే ఇలాగే ఉంటుందని” ఒకరు కామెంట్ చేయగా.. ”ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతోంది ఏనుగులకు దూరంగా ఉండాలని” మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook