Animal Love Viral Video: నెటిజన్ల హృదయాలను గెలిచిన జంతువుల ప్రేమ..నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో..
Animal Love Viral Video: మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. ఈ వైరల్ అవుతున్న వీడియో మనుషులకు గుణపాటాలు నేర్పేలా మారింది. ఈ వీడియోని చూసి నటిజన్లో తెగ ఆశ్చర్యపోతున్నారు.
Animal Love Viral Video: సోషల్ మీడియా ప్రభావం పెరగడం వల్ల దాని ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంతేకాకుండా ఇందులోని విషయాలను సోషల్ మీడియా వినియోగదారులు సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్క సమాచారాన్ని, విషయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకొని వాటిపై సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని సోషల్ మీడియా వినియోగదారులను దిగ్భ్రాంతి కలిగిస్తే.. మరికొన్ని నవ్వు పుట్టించే విధంగా ఉంటున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి.
నేటి సమాజంలో ప్రజలంతా కులం మతం అనే పిచ్చితో బతికేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పలు సామాజిక వర్గాల్లో గొడవలు ఏర్పడుతున్నాయి. అయితే వాటికి భిన్నంగా జంతువులు ఎప్పుడు ప్రేమతో ఉంటాయనే నిదర్శనానికి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వీడియో జనాలకు గుణపాఠం నేర్పుతోంది.
మీరు ఈ వీడియోలో గమనిస్తే కొన్ని జంతువులు మీకు కనిపిస్తాయి. కుక్క, పిల్లి ఎప్పుడు శత్రువులానే ఉంటాయి. కానీ ఈ వీడియోలో దానికి భిన్నంగా అవి రెండు ఒకే చోట కలిసికట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఓ జింక పడుకొని కూడా ఉంటుంది. ఈ జంతువులన్నీ జింక దగ్గరికి వెళ్లి ఒకదానికి మరొకటి ప్రేమను చూపిస్తూ హాయిగా ఆడుకుంటాయి. ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఈ వీడియోలో ఎంతో చక్కగా పిల్లి జింక ఆడుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొన్ని జింకలు అయితే ఇతర జంతువులను చూసి పారిపోతుంటాయి. కానీ ఈ జింక అన్నిటిలా కాకుండా ఇతర జంతువులపై ప్రేమను చూపుతూ.. వాటి ప్రేమ జింక పొందుతోంది. అంతేకాకుండా జింక పిల్లి తలపై తన నాలుకతో ప్రేమతో నెమురుతోంది.
తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అయిన ట్విట్టర్లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను నరేందర్ సింగ్ అని సోషల్ మీడియా వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంతువుల ప్రేమను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరైతే వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: Auto Rickshaw Blast: కదులుతున్న ఆటోలో మంటలు.. వెలుగులోకి షాకింగ్ విషయం
Also Read: Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ బ్యాడ్ లక్.. అనుకోకుండా పెవిలియన్‌కు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి