Steve Jobs: యాపిల్ స్టీవ్ జాబ్స్ అప్లికేషన్ అమ్ముడుపోయిన ధర తెలుసా
Steve Jobs: స్మార్ట్‌ఫోన్ రంగంలో బ్రాండ్ ఇమేజ్ ఇవాళ్టికి యాపిల్ కంపెనీకే సొంతం. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అందరికీ తెలిసిన పేరే. కానీ అతని తొలి ఉద్యోగం ఎక్కడ.. ఆ దరఖాస్తు ఇప్పుడెక్కడ ఉందో తెలుసా.
Steve Jobs: స్మార్ట్‌ఫోన్ రంగంలో బ్రాండ్ ఇమేజ్ ఇవాళ్టికి యాపిల్ కంపెనీకే సొంతం. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అందరికీ తెలిసిన పేరే. కానీ అతని తొలి ఉద్యోగం ఎక్కడ.. ఆ దరఖాస్తు ఇప్పుడెక్కడ ఉందో తెలుసా.
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్(Steve Jobs) గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు మీకు తెలుసా. వ్యాపారవేత్తలకు ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు స్థాపించేవారికి స్టీవ్ జాబ్స్ ఒక ఆదర్శం. అటువంటి స్టీవ్ జాబ్స్ ప్రారంభంలో ఏ ఉద్యోగం చేశారు..ఎక్కడ చేశారనే వివరాలు తెలుసా. స్టీవ్ జాబ్స్ ముందు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ యాపిల్ కంపెనీ స్థాపనకు ప్రయత్నించాడు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన రీడ్ కళాశాల నుంచి బయటకు వచ్చిన తరవాత ఉద్యోగం కోసం ఓ కంపెనీలో చేరాడు. కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్‌తో పాటు ఇంగ్లీషు లిటరేచర్ నైఫుణ్యతలుగా దరఖాస్తులో తెలిపారు స్టీవ్ జాబ్స్.
ఈ తొలి దరఖాస్తు ఇప్పుడు సంచలనంగా మారింది. వేలంపాటలో ( Application auction) భారీ ధరకు అమ్నడుపోయింది. 1973లో చేసిన ఈ దరఖాస్తును ప్రముఖ సంస్థ ఛార్టర్ ఫీల్డ్స్ వేలం వేయగా.. స్టీవ్ జాబ్స్ తన చేతిలో రాసిన ఉద్యో దరఖాస్తు 1.6 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన బిడ్డింగ్ మార్చ్ 24న ముగిసింది.1974లో అటారీ కంపెనీలో ఉద్యోగం కోసం చేసిన స్టీవ్ జాబ్స్..యాపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ వోజ్నియాక్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి 1976లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో జాబ్స్ గ్యారేజిలో యాపిల్ సంస్థ(Apple company)ను ప్రారంభించారు. 2011లో స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా మరణించారు.
Also read: WhatsApp: మొబైల్ మరియు Internet లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు, త్వరలో సరికొత్త ఫీచర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook