WhatsApp: మొబైల్ మరియు Internet లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు, త్వరలో సరికొత్త ఫీచర్

WhatsApp May| Work Without Your Mobile And Internet |వాట్సాప్ మెసేంజర్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో సైతం మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు శుభవార్త అందించడానికి సిద్ధంగా ఉంది

Written by - Shankar Dukanam | Last Updated : Mar 23, 2021, 12:32 PM IST
WhatsApp: మొబైల్ మరియు Internet లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు, త్వరలో సరికొత్త ఫీచర్

WhatsApp Without Your Mobile And Internet: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు శుభవార్త అందించడానికి సిద్ధంగా ఉంది. వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన ప్రైవసీ పాలసీ విధానాన్ని పక్కనపెడితే సరికొత్త ఫీచర్‌ను లాంఛ్ చేయాలని భావిస్తోంది. మొబైల్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవకున్నా వాట్సాప్ వినియోగించుకునేలా బీటా వెర్షన్‌ను పరీక్షిస్తోంది.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఓఎస్, ఆండ్రాయిడ్ వాట్సాప్ వినియోగదారులకు ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ మెసేంజర్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో సైతం మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు(WhatsApp New Feature) ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో ఒకే నెంబర్‌తో పలు మొబైల్స్, డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ సేవల్ని వినియోగదారులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి ఫేస్‌బుక్ మరియు వాట్సాప్.

Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఖాతాదారులు EPF Balance వివరాలు తెలుసుకోవచ్చు

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌(Twitter)లో వాట్సాప్ ఇలా రాసుకొచ్చింది. మీ మొబైల్‌లో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా, ఫోన్ సైతం అక్కడ లేకున్నా వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఐఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లు వాట్సాప్ సేవల్ని వినియోగించుకోవచ్చు. అయితే ఈ బీటా వెర్షన్‌లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ లాంటి కొన్ని ఫీచర్లు పనిచేయడం లేదని పేర్కొంది. పాత వెర్షన్ వాడుతున్నవారికి వాట్సాప్ కాల్స్, మెస్సెజ్‌లు చేయడానికి సపోర్ట్ చేయడం లేదని, కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వాలని యూజర్లకు సూచించింది.

మీ వాట్సాప్‌ వెబ్‌ బీటా వెర్షన్‌కు ఒకసారి మీరు కనెక్ట్ అయినట్లయితే, మీ ఫొన్‌లో ఇంటర్నెట్ లేకున్నా యాప్ వాడుకోవచ్చునని పేర్కొంది. గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూజర్ ఈ కొత్త సేవలకు ఓకే చెప్పినట్లు అవుతుంది. వీటితో పాటు వాయిస్ మెస్సేజ్‌లలో వేగాన్ని పెంచడం లాంటి తదితర ఫీచర్లపై వాట్సాప్ ఫోకస్ చేస్తోంది. అయితే బీటా వెర్షన్‌లో సైతం ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాలేదు.

Also Read: Google Maps Dark Theme Feature: గూగుల్ మ్యాప్స్ డార్క్ థీమ్ ఫీచర్, Android యూజర్లకు సరికొత్త సౌకర్యం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News