Baba Vanga 2023 Predictions: 2022 కంటే 2023 మరింత డేంజర్‌గా ఉండనుందా ?
Baba Vanga 2023 Predictions: ప్రపంచ ప్రఖ్యాత మార్మికురాలు బాబా వంగా...రానున్న దశాబ్దాలు, శతాబ్దాలకు సంబంధించి చెప్పిన జోస్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని నిజమయ్యాయి. కూడా.
ఇప్పుడు ప్రపంచమంతా బాగా వంగా జోస్యంపైనే ఫోకస్ నెలకొంది. ఇప్పటికే బాబా వంగా చెప్పిన జోస్యాలు నిజం కాగా..మరికొన్ని రానున్న కాలంలో అతి భయంకరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
బల్గేరియాకు చెందిన బాబా వంగా జోస్యం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆందోళనకు గురి చేస్తోంది. రానున్న దశాబ్దం, శతాబ్దాలకు సంబంధించి జరిగే పరిణామాలపై బాబా వంగా జోస్యాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకూ చెప్పినవాటిలో కొన్ని నిజంగా కాగా కొన్ని జరగలేదు. అధికశాతం నిజం కావడంతో ఇప్పుడు రానున్న కాలానికి చెప్పిన జోస్యంపై ప్రపంచంలో ఆందోళన రేగుతోంది. ముఖ్యంగా రానున్న కాలంలో భారీ విధ్వంసంతో ప్రపంచం అంతం కానుందని చేసిన హెచ్చరిక అందర్నీ వణికిస్తోంది. 2023కు సంబంధించి కూడా బాబా వంగా చాలా జోస్యాలు చెప్పింది. బాగా వంగా చెప్పిన 5 జోస్యాలు నిజమైతే ప్రపంచం ఏమౌతుందనేదే ఇప్పుడు అసలు ఆందోళన.
2023 సంవత్సరంలో బాగా వంగా జోస్యం
బాబా వంగా అంచనాల ప్రకారం ప్రపంచంలోని ఓ పెద్ద దేశం బయోలాజికల్ ఆయుధాలతో ప్రజలపై దాడికి దిగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే..రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఓ ముప్పుగా మారుోతంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే న్యూక్లియర్ దాడికి సంబంధించి పలు హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు.
బాబా వంగా అంచనాల ప్రకారం సోలార్ తుపాను లేదా సోలార్ సునామీ 2023లో సంభవించనుంది. ఫలితంగా భూమికున్న భూమ్యాకర్షణ శక్తి చాలావరకూ దెబ్బతినవచ్చు.
బాబా వంగా అంచనాల ప్రకారం 2023లో ప్రపంచమంతా చీకటిలో ఉండిపోనుంది. ఏలియన్స్ చేసే దాడిలో లక్షలాదిమంది ప్రజలు చనిపోనున్నారు.
న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో విస్ఫోటనం జరగవచ్చని అంచనా. ఫలితంగా అందులోంచి వెలువడే విష వాయువులు ఆసియా మొత్తం వ్యాపించనున్నాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు ప్రబలనున్నాయి.
2023 నాటికి మనుష్యులు లేబరేటరీల్లో జన్మించనున్నారు. లేబరేటరీల నుంచి మనుష్యుల కేరక్టర్, చర్మం రంగు నిర్ణయమౌతుంది. అంటే పుట్టుక మొత్తం నియంత్రణలో ఉంటుంది.
2022లో నిజమైన అంచనాలు
బాబా వంగా 2022లో జరుగుతాయని చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయి. ఇందులో నీళ్ల కొరత వల్ల కొన్ని దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ముఖ్యంగా వరదల కారణంగా ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎవరీ బాబా వంగా
బాబా వంగా బల్గేరియాకు చెందిన ఓ మార్మికురాలు. ఆమె అసలు పేరు వంగేలియా పండేవా గుష్తెరోవా. బాల్యంలోనే కంటి చూపు కోల్పోయింది. 1996లో మరణించడానికి ముందే చెప్పిన చాలావరకూ జోస్యాలు నిజమయ్యాయి. ఆమెకు అతీంద్రియ శక్తులుండేవని నమ్ముతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook