Bear Gets Surprised after seeing in Mirror: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం ఏదో ఒక వార్త లేదా వీడియో వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటాయి. అందులో సరదా, భయానకమైవి, ఊహించనివి కూడా ఉంటాయి. తాజాగా ఎలుగుబంటికి సంబంధించిన ఓ సరదా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎలుగుబంటి తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడవి జంతువుల ఫన్నీ మూమెంట్స్‌ని కెమెరాలో బంధించడం చాలా కష్టం. ఈ వీడియో కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వీడియో కూడా ఆ కోవకే చెందింది. ఎలుగుబంటి ఫన్నీ మూమెంట్స్‌ని బంధించడం కోసం ముందుగా ఓ అద్దంను సెటప్ చేశారు. ఎలుగుబంటి అడవిలో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అద్దం దగ్గరికి చేరుకుంటుంది. ఎలుగుబంటి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడగానే..  ఒక్కసారిగా అద్దంపై దాడి చేస్తుంది. వేరే జంతువు అక్కడ ఉందని అద్దంపై దాడి చేయడంతో అది కిందపడి పోతుంది. దాంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.



ఈ వీడియో సంజయ్ శర్మ అనే ట్విట్టర్ యూసర్ పోస్ట్ చేశాడు. దాంతో ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలుగుబంటి వీడియో నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి. ఫన్నీ వీడియో, సూపర్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న ఎలుగుబంటి అమాయకత్వానికి అందరూ ఫిదా అవుతున్నారు. అది చేసిన పనిని నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు.  


Also Read: King Cobra Video: టాయిలెట్‌లో కింగ్ కోబ్రా.. చూసుకోకుండా కూర్చుంటే అంతే సంగతులు (వీడియో) 


Also Read: Flipkart Offers: ఈ బ్రాండ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21 వేలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4999కే..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.