Hidden Camera: బాత్రూం, ట్రయల్ రూమ్స్ ఎక్కడ హిడెన్ కెమేరాలున్నా ఇట్టే తెలుసుకోవచ్చు
Hidden Camera: ఇటీవలి కాలంలో సీక్రెట్ కెమేరా వ్యవహారాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్స్, ట్రయల్ రూమ్స్, వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమేరాలు అమర్చుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరి వీటిని ఎలా అరికట్టడం, ఎలా పసిగట్టవచ్చు..
Hidden Camera: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కమేరాలు అమర్చిన వ్యవహారం తీవ్ర వివాదంగా మారి దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనతో కళాశాలల్లో చదివే అమ్మాయిల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ కెమేరాలను గుర్తించే మార్గం ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హిడెన్ కెమేరాలు మహిళల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో మనకు తెలియకుండా వాష్ రూమ్స్, హాస్టల్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ట్రయల్ రూమ్స్‌లో ఏర్పాటు చేసే రహస్య కెమేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి, వాటిని పసిగట్టే మార్గం లేదా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. కానీ మీరిక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితంగా మీరు హిడెన్ కెమేరాలను పసిగట్టే డివైస్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. ఇది థర్మామీటర్ పరిమాణంలో ఉంటుంది. హిడెన్ స్పై కెమేరా డిటెక్టర్ వైర్‌లెస్ సిగ్నల్ స్కాన్ ఆధారంగా పనిచేస్తుంది. ధర 6955 రూపాయలు.
హిడెన్ కెమేరా డిటెక్టర్ పెన్ మరో ఆప్షన్. ప్రస్తుతం అమెజాన్‌లో 4599 రూపాయలకు అందుబాటులో ఉంది. మీకు తెలియకుండా హోటల్ రూమ్స్, ట్రయల్ రూమ్స్‌లో ఏర్పాటు చేసే హిడెన్ కెమేరాలను గుర్తించవచ్చు. ఒకసారి రీఛార్జ్‌పై 25 గంటలు పనిచేయగలదు. ఇందులోంచి వచ్చే లైట్‌ను ఫోకస్ చేయడం ద్వారాహిడెన్ కెమేరా ఎక్కడనేది గుర్తించవచ్చు. ఇక Metricsquare Hidden Camera Detector అమెజాన్‌లో 3999 రూపాయలకు లభిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్ లైట్ సహాయంతో గుర్తించవచ్చు.
మరో హిడెన్ కెమేరా Muayb Hidden Camera Detector ధర 3079 రూపాయలు. హిడెన్ జీపీఎస్, బగ్స్ కూడా గుర్తించవచ్చు. ఇందులో ఉండే యాంటీనా ద్వారా గుర్తించవచ్చు. Skypearl Hidden Camera Detector ధర చాలా తక్కువ. కేవలం 1199 రూపాయలకే లభించనుంది. ఇందులోంచి వచ్చే రెడ్ లైట్ ద్వారా అనుమానం ఉన్న ప్రదేశాలపై ఫోకస్ చేసి తెలుసుకోవచ్చు. 20 గంటలు పనిచేస్తుంది. ఇదే కంపెనీకు చెందిన మరో హిడెన్ కెమేరా పెన్ రూపంలో ఉంది. ఇది 4599 రూపాయలకు అమెజాన్‌లో లభిస్తోంది.
Also read: CBI Arrests Sandip Ghosh: ఆర్‌జి కర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.