Fake TikTok : టిక్‌టాక్ ( TikTok ), షేర్ ఇట్ ( Share It ) వంటి 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన ( Indian Ban 59 China Apps ) విషయం తెలిసిందే. ఈ యాప్స్‌ను నిషేధించినప్పటి నుంచి మన దేశానికి చెందిన చింగారీ (Chingari ) , రొపోజో ( Roposo ) వంటి యాప్స్‌ డౌన్‌లోడ్స్ ( App Downloads ) పెరిగాయి. అయితే ఇలాంటి సమయంలో కొంత మంది ఆన్‌లైన్ మోసాలకు ( Online Frauds ) పాల్పడుతున్నారు. తాజాగా టిక్‌టాక్ యాప్ నిషేధించారు కాబట్టి టిక‌టాక్ ప్రో (TikTok Pro ) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ కొంత మందికి మెసేజెస్‌లు వచ్చాయి. ఈ మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్‌లో వివిధ అంశాలను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ( Access Permission ) ఇవ్వండి అనే నోటిఫికేషన్ వస్తుంది. Also Read :SBI New Rules To Withdrawal: ఎస్‌బిఐ ఏటీఎం నిమయాలు మారాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



టిక్‌టాక్ ప్రో ఈ నోటిఫికేషన్ ఓకే అంటే అప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. కానీ అందులో ఏమీ కనిపించదు. ఇదంతా మోసం ( TikTok Pro Fraud ) అని తెలుసుకున్న పలువురు దీని గురించి సైబర్ డిపార్ట్‌‌మెంట్‌కు ( Cyber Department ) తెలిపారు. ఇలాంటి గుర్తు తెలియని లింక్స్ ( Unknown  Links ) వల్ల డాటా చౌర్యం ( Data Theft ) జరిగే అవకాశం ఉంటుంది. పైగా అవి ఫోన్‌లోనే తిష్టవేసుకుని ఉంటాయి. దీని వల్ల ఫోన్ సెక్యూరిటీ ఉండదు అని నిపుణులు అంటున్నారు. మీకు కూడా ఇలాంటి గుర్తు తెలియని మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.



 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..