Python Swallows 300 Kgs Cow: బాప్రే.. 300 కిలోల ఆవును మింగేసిన భారీ కొండచిలువ.. ఎగబడి చూస్తున్న జనాలు
Python Swallows 300 Kgs Cow Terrifying Video: ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే లాంటి వీడియోను మాత్రం ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియోలో భారీ ఆనకొండ పాము ఒక పెద్ద ఆవును మింగేసింది. దాదాపు ఆవు టెయిల్ బోన్ వరకు ఆనకొండ నోట్లోకి వెళ్లిపోయింది. అంత పెద్ద ఆవును మింగేసిందంటే.. ఆ ఆనకొండ ఎంత పెద్దది, ఎంత డేంజర్ అయ్యుంటుందో ఊహించడం కూడా కష్టమే.
Terrifying Video.. Python Swallows 300 Kilos Cow: సాధారణంగా పాములు కోడిగుడ్లు, పాము గుడ్లు, పాములను మింగడం చూసే ఉంటారు. కానీ పాముల్లో పెద్ద పాములుగా పేరున్న అనకొండ, కొండచిలువలు ఏకంగా జంతువులు, ఇంకొన్నిసార్లు మనుషులను సైతం తినేంత పెద్దవిగా ఉంటాయనే సంగతి తెలిసిందే. మేక పిల్లలు, జింక పిల్లలు సైజ్ ఉండే జంతువులను కూడా సునాయసంగా తినేస్తుంటాయి. అలాంటి వీడియోలు ఎన్నో ఇప్పటికే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసే ఉంటారు.
కానీ ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే లాంటి వీడియోను మాత్రం ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియోలో భారీ ఆనకొండ పాము ఒక పెద్ద ఆవును మింగేసింది. దాదాపు ఆవు టెయిల్ బోన్ వరకు ఆనకొండ నోట్లోకి వెళ్లిపోయింది. అంత పెద్ద ఆవును మింగేసిందంటే.. ఆ ఆనకొండ ఎంత పెద్దది, ఎంత డేంజర్ అయ్యుంటుందో ఊహించడం కూడా కష్టమే.
యూట్యూబ్‌లో రెండేళ్ల క్రితం శ్రీలంకకు చెందిన యూట్యూబర్ ఈ టెర్రిఫిక్ వీడియోను పోస్ట్ చేసినట్టు అర్థమవుతోంది. వీడియో కేవలం 15 సెకన్ల నిడివి మాత్రమే ఉండటంతో అది ఆనకొండనా లేక పైథానా అనేది స్పష్టంగా అర్థం కావడం లేదు. యూట్యూబ్ లో వస్తున్న కామెంట్స్ చూస్తే వీడియో చూసిన నెటిజెన్స్ కూడా అదే అయోమయంలో ఉన్నారని అర్థమవుతోంది. అది ఆనకొండ కాదని కొందరు.. అది పైథాన్ అని కొందరు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Oldage Woman Stops Train: భారీ రైలు ప్రమాదాన్ని నివారించేందుకు రైలుకు ఎదురెళ్లిన బామ్మ
ప్రపంచంలో అతి పెద్ద పైథాన్ స్నేక్స్ లో ఏయే జాతి పైథాన్స్ ఎంత పొడవు ఉంటాయనే విషయానికొస్తే..
1) గ్రీన్ ఆనకొండ - 30 అడుగుల పొడవు
2) రెటిక్యులేటెడ్ పైథాన్ పాము - 29 అడుగుల పొడవు
3) అమేథిస్టైన్ పైథాన్ - 27 అడుగుల పొడవు
4) బర్మీస్ పైథాన్ - 23 అడుగుల పొడవు
5) ఇండియన్ పైథాన్ - 20 అడుగుల పొడవు
6) ఆఫ్రికన్ రాక్ పైథాన్ - 16 అడుగుల పొడవు
7) బ్లాక్ మాంబ - 14 అడుగుల పొడవు
8) బోవ కాన్‌స్ట్రిక్టర్ - 13 అడుగుల పొడవు
9) కింగ్ కోబ్రా - 13 అడుగుల పొడవు
10) కింగ్ బ్రౌన్ స్నేక్ - 11 అడుగుల పొడవు
సాధారణంగా విషపూరితమైన సర్పాలు అవి వేటాడే జంతువులను కాటేసి విషం చిమ్మి చంపుకుని తింటాయి. పైథాన్ పాముల విషయానికొస్తే.. అవి తమ కండబలంతో జంతువులను చుట్టేసి, ఊపిరి ఆడకుండా చేసి వాటిని చంపి తింటాయి.
ఇది కూడా చదవండి : Lions Hunting Newborn Buffalo Calf: గుండెల్ని పిండేసే వీడియో.. అప్పుడే పుట్టిన దూడను చుట్టుముట్టిన సింహాలతో తల్లి ఒంటరి పోరాటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook