Eagle Vs King Cobra: గుడ్ల కోసం గద్ద- పాముల మధ్య భీకర యుద్ధం.. ఎవరిదో పై చెయ్..?

Eagle Vs Cobra Video Got Viral: ఆహారం వేటకు బయల్దేరిన పాము.. ఒక గుడ్డును మింగడం దూరంగా ఉండే కనిపెట్టిన గద్ద.. క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుతూ వచ్చి పాముతో పోరాటానికి దిగడం చూస్తే ఔరా అనిపిస్తుంది. సాధారణంగానే పాము గద్ద కంటపడితే ఇక అంతే సంగతి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 09:23 AM IST
Eagle Vs King Cobra: గుడ్ల కోసం గద్ద- పాముల మధ్య భీకర యుద్ధం.. ఎవరిదో పై చెయ్..?

Eagle Vs King Cobra Fighting Video Got Viral: పక్షి గుడ్లు తినడానికి వచ్చిన నాగు పాముపై గద్ద ఎలా దాడి చేసిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక జీవి తమ ఉనికికే ప్రమాదం వస్తోందని తెలిసినప్పుడు, లేదా తమ సంతానానికి ముప్పు పొంచి ఉందని తెలిసినప్పుడు అవతలి వారు ఎంత శక్తివంతులైనా.. ఆ జీవి తమ ప్రాణాలకు తెగించి ఎలా పోరాడుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. ఆహారం వేట కోసం బయటికొచ్చిన ఓ పాము, అక్కడే అడవిలో ఉన్న పక్షి గుడ్లను తినే ప్రయత్నం చేసింది. 

ఆహారం వేటకు బయల్దేరిన పాము.. ఒక గుడ్డును మింగడం దూరంగా ఉండే కనిపెట్టిన గద్ద.. క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుతూ వచ్చి పాముతో పోరాటానికి దిగడం చూస్తే ఔరా అనిపిస్తుంది. సాధారణంగానే పాము గద్ద కంటపడితే ఇక అంతే సంగతి. ఆకాశంలో అంత ఎత్తులో విహరిస్తూ కూడా నేలపై సంచరించే జీవులను కనిపెట్టగలిగేంత చూపు గద్దలకు ఉంటుందని చెబుతుంటారు. అందుకే గద్దలు ఆకాశంలో ఎగురుతూనే అదే సమయంలో నేలపై ఆహారం వెతుక్కుంటుంటాయంట. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News