Big snake found in home in wanaparthy snake team rescued video goes viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. ముఖ్యంగా అడవులు, చెట్లు ఉన్న ప్రదేశాలలో పాములు కన్పిస్తాయి. కొందరు పాములు కన్పిస్తే భయంతో పారిపోతుంటే.. మరికొందరు మాత్రం పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించ కూడదని భావిస్తారు. పాములు పొలాలు, వడ్లు, బియ్యం సంచులు దగ్గర ఉండే ఎలుకల కోసం మన ఇళ్లలోకి వస్తుంటాయి. అడవులు, దట్టంగా చెట్లు ఉన్న చోట కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కొందరు అనుకోకుండా పాము కాటుకు గురౌతుంటారు. పాములు కాటు వేస్తే దాన్నిపట్టుకుని షాడిజం చూయిస్తారు మరికొందరు. పాములకు ఆపద కల్గిస్తే కాలసర్పదోషాలు చుట్టుకుంటాయని పెద్దలు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం భారీ సర్పానికి చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ లో నిలిచింది. 


పూర్తి వివరాలు..


తెలంగాణలోని వనపర్తిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చందాపూర్ రోడ్డులోని, పీర్లగుట్ట సమీపంలోని ఒక ఇంట్లో భారీ సర్పం ప్రవేశించింది. ఇంటి యజమానికి రాంబాబు గమనించాడు. వెంటనే అతను.. స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇచ్చారు. వెంటనే  అక్కడకు చేరుకున్న స్నేక్ సొసైటీవారు పామును చాకచక్యంగా ఇంటినుంచి బైటకు తీసుకొచ్చారు. పాము భారీగా బుసలు కొడుతూ... పలు మార్లు కాటు వేసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో స్నేక్ సొసైటీ సభ్యులు ఎంతో జాగ్రత్తగా పామును బంధించారు. వీరి ఇల్లు అడవికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.


Read more: Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. స్నేక్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ.. పాము పదడుగుల వరకు పొడవుందని, అత్యంత విషసర్పమని కూడా చెప్పారు. తాము ఇప్పటి వరకు.. 7,013 పాముల్ని పట్టుుకున్నామని.. ఇంత పెద్ద సర్పం ఎప్పుడు చూడలేదంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత భారీ సర్పాన్ని.. దగ్గరలోని అడవిలో వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter