Fraud For Community Wedding Scheme: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పెళ్లిళ్ల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పెళ్లి చేసుకున్న పథకంకు అర్హులైన వారికి,  కొందరు నగదు రూపంలో ఇస్తుంటే, మరికొన్ని చోట్ల బంగారం కూడా ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఇదే అదునుగా భావించి కొందరు సర్కారు సొమ్మును అక్రమంగా కాజేసేందుకు ప్లాన్ లు వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల యువతీ, యువకులు దళారులతో కుమ్మక్కై పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు దిగి ఆతర్వాత డబ్బులు రాగానే పంచేసుకుని ఎవరిదారిన వారి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన నెట్టింట వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..


ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సాముహిక వివాహలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి.  కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌కు సంబంధించి బల్లియాలో జరిగిన ఒక కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. జనవరి 25న జరిగిన కమ్యూనిటీ వెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. దీనిలో అనేక జంటలు పెళ్లి చేసుకొవడానికి వచ్చారు. అయితే.. ఎక్కువ మంది అమ్మాయిలు అచ్చం పెళ్లికూతురు కాస్టూమ్స్ లలో రెడీ అయి వచ్చారు. ఈ వేడుక చూడటానికి ఎంతో మంది  యువకులు అక్కడికి వెళ్లారు.


ఈ క్రమంలోనే.. బల్లియా నివాసి బబ్లూ కూడా కమ్యూనిటీ పెళ్లిళ్లు చూడటానికి వెళ్లాడు. అయితే.. అక్కడున్న వారు కొందరు పెళ్లికొడుకు వేషం ఆఫర్ ఇచ్చాడని తెలిపాడు. దీని కోసం తనకు రూ.2,000 నుంచి 3,000 ఇచ్చారని కూడా తెలిపాడు. అక్కడున్న కొందరు.. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు వేరే మగవాళ్లను కూడా పెళ్లికొడుకులా తయారు చేశారని అన్నారు.


ఇదిలా ఉండగా.. కొందరు మహిళలు తమకు తామే మెడలో పూల మాల వేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, దీనిపై బల్లియా జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ స్పందించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించిన పథకం డబ్బులు ఇవ్వలేదన్నారు. 


Read Also: Snakes: ఈ చెట్లంటే పాములకు హడల్.. ఇవి ఉన్న చోట అస్సలు కన్పించవు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook