Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్‌గడ్‌కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది. బైక్ స్టంట్స్ చేయబోయిన ఓ యువకుడు బైకుపై నుంచి పట్టుతప్పి కిందపడిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ప్రమాదంలో అతడి వీపు, తలకు గాయాలయ్యాయి. భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి కనుక చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియో మీరూ చూసేయండి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ఎక్కువ తాపత్రయపడితే ఇలాగే ఉంటుందనే కోణంలో అసహనం వ్యక్తంచేసిన దీపాన్షు కబ్ర.. 'మీ పిల్లలు, స్నేహితులను అలాంటి చెత్త దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ప్రమోట్ చేయడం వంటి పనులు చేయనీయకండి' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తిక్క వేషాలు వేస్తే ఏం జరుగుతుందో తెలియాలంటే అలాంటి కుర్రకారుకు ఇలాంటి వైరల్ వీడియోలు (Viral videos) చూపించాల్సిందే.


Also read : Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే


అంతేకాకుండా మీ పిల్లలు లేదా మిత్రుల్లో ఎవరైనా ఇలాంటి స్టంట్స్ చేయడానికి పూనుకుంటే, వారిని నిరోధించి వారికి ట్రాఫిక్ రూల్స్ పాటించడం (Traffic rules) నేర్పించండి అంటూ నెటిజెన్స్‌కి విజ్ఞప్తి చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook