Brave Lady Traps Black King Cobra in Forest: పామును దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా చమటలు పడుతుంది. అదే పక్కనే ఉంటే కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి. అయితే ఎంతటి భయంకరమైన పామునైనా సులువుగా దారిలోకి తెచ్చుకోగల సమర్థులు స్నేక్ క్యాచర్స్ మాత్రమే. బ్లాక్ కింగ్ కోబ్రా లాంటి పాములు వారికి కూడా అస్సలు చిక్కవు. స్నేక్ స్నాచర్‌లకు కూడా కింగ్ కోబ్రాలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ గ్రామంకు సమీపంలో ఉన్న రోడ్డుపై బ్లాక్ కింగ్ కోబ్రా ఉందన్న సమాచారం స్నేక్ స్నాచర్స్ తెలుసుకుంటారు. కింగ్ కోబ్రా కాటు నుంచి మనుషులను కాపాడేందుకు స్నేక్ స్నాచర్స్ దాని కోసం వేలుకుతారు. ఓ లేడీ స్నేక్ స్నాచర్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో పాము కోసం వెతుకుతుంటుంది. అయితే కింగ్ కోబ్రా రోడ్డు పక్కనే ఉన్న గుంటలో ఉంటుంది. లేడీ స్నేక్ స్నాచర్‌ను చూసిన అది రోడ్డుపైకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే లేడీ స్నేక్ స్నాచర్‌ దాని తోకను పట్టుకుని లోపలికి లాగేస్తుంది. దాంతో అది కాటేయడానికి దూసుకురాగా ఆమె వెనక్కి వెళ్లి తప్పించుకుంటుంది. 


బ్లాక్ కింగ్ కోబ్రా మరోసారి రోడ్డుపైకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించగా.. లేడీ స్నేక్ స్నాచర్‌తోక పట్టుకుని లాగేస్తుంది. కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ఆమె పలు మార్లు ప్రయత్నించినా.. అది అస్సలు చిక్కదు. బుసలు కొడుతూ లేడీ స్నేక్ స్నాచర్‌కు చుక్కలు చూపిస్తుంది. కాటేయడానికి మీదికి వచ్చినా ఆ లేడీ మాత్రం అస్సలు భయపడదు. చివరకు కింగ్ కోబ్రా తలను ఓ స్టిక్ సాయంతో నేలకు అదిమి.. తలను పట్టేసుకుంటుంది. ఆపై దాన్ని బంధిస్తుంది.



బుసలు కొడుతున్న బ్లాక్ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేసిన లేడీ స్నేక్ స్నాచర్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'Giant King Cobra' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 45,101 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 


Also Read: King Cobra Girl Viral Video: బొరియలో ఐదు కింగ్ కోబ్రాలు.. ఒట్టిచేతులతో ఈజీగా పట్టేసిన అక్కాచెల్లెళ్లు! షాకింగ్ వీడియో  


Also Read: Trigrahi Yog 2023: 3 గ్రహాల మహా యాదృచ్చికం.. ఈ 3 రాశుల వారికి మారనున్న తలరాత! అపారమైన డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి