Black King Cobra Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించినవి చక్కర్లు కొడుతుంటాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగు, కుక్క, కోతి, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు చాలా సరదాగా ఉంటే.. మరికొన్ని మాత్రం సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు అయితే భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి కస్టపడి పట్టుకుని అడవిలో వదిలేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలో డేరింగ్ స్నేక్ క్యాచర్‌గా 'మురళీవాలే హౌస్లా' పేరు తెచ్చుకున్నాడు. ఎంత పెద్ద స్నేక్స్‌ని అయినా అతడు చాలా ఈజీగా పట్టుకుంటాడు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఒట్టిచేతులతోనే పాములను పట్టేస్తుంటాడు. బుసలు కొట్టే భారీ సైజ్ కింగ్ కోబ్రాలను సైతం సునాయాసంగా పడుతాడు. మురళీవాలేకి సొంత యూట్యూబ్‌ ఛానెల్ (Murliwale Hausla) కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలను ఎప్పటికపుడు పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలను పట్టుకుని అడవిలో వదిలే వీడియోను షేర్ చేశాడు. దీంతో ఆ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.



స్నేక్ క్యాచర్‌ మురళీవాలే హౌస్లా ఇటీవల యూపీ పరిసర ప్రాంతాల్లో రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలను బంధించాడు. ఆ పాములను వదిలేందుకు అడవి ప్రాంతానికి వచ్చాడు. పిల్ల బ్లాక్ కింగ్ కోబ్రాను మురళీవాలే సంచిలోంచి బయటికి వదిలి.. దాన్ని చేతిలో పట్టుకుని చాలా ఈజీగా వదిలేస్తాడు. ఇక భారీ బ్లాక్ కింగ్ కోబ్రాను కూడా సంచిలోంచి తీసి బయటికి వదిలేస్తాడు. కాసేపటికి అది కాటేయడానికి మురళీవాలే మీదికి రాగా.. ఒక జంప్ కొట్టి తృటిలో తప్పించుకుంటాడు. అనంతరం ఆ బ్లాక్ కింగ్ కోబ్రాను అడవిలో వదిలేస్తాడు. ఈ వీడియో 4 నెలల క్రితందే అయినా ఇప్పుడు వైరల్ అవుతోంది.  


Also Read: పాత ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపింది! చివరకు ఏమైందంటే


Also Read: IND vs AUS 2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్! భారత్ స్కోర్ ఏంటంటే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి