Brazilian Young woman applied poop on her face for glow: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు అందంగా కన్పించేదుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇంట్లోని అన్నిరకాల కూరగాయాలు, వెజిటెబుల్స్ లను ఉపయోగించుకుంటారు. కొంత మంది ఆయుర్వేదిక్ మెడిసిన్ లను అందంగా కన్పించేందుకు ఉపయోగిస్తారు. మరికొందరు చెట్ల రసాలు, వనమూలీకల మీద కూడా ఆధారపడతారు. కిచెన్ లలో దొరికి వాటిపై కూడా చాలా మంది తమ ముఖం ఎలా మెరిసెలా చేస్తారో రీసెర్చ్ సైతం చేస్తుంటారు. మరికొందరు మార్కెట్లలో దొరికి ప్రాడక్ట్స్ మీద ఆధారపడుతు ఉంటారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 మార్కెట్ లోకి ఏ కొత్త ఫెస్ క్రీమ్ వచ్చిన కూడా.. దానిపై పడిపోతుంటారు. తమ ముఖం మెరిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల అందంగా కన్పించేందుకు ఏకంగా పాము రక్తంను కూడా ముఖానికి పూసుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా, ఒక బ్రెజిలీయన్ యువతి చేసిన ఛెండాలం మాత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఆమె తన ముఖానికి ఏకంగా మలంను పూసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బ్రెజిలీయన్ కు చెందిన యువతి తన ముఖానికి మలంను అప్లై చేసుకుంది. మొదట ఆమె తన మలాన్ని ఒక చిన్న బాక్స్ లోపెట్టి.. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని ఒక స్టిక్ సహాయంతో ముఖంకు అప్లై చేసుకుంది. మలం వాసన రాకుండా.. ఆమె తన ముఖానికి క్లిప్ కూడా పెట్టుకుంది. అంతేకాకుండా..ముఖానికి మలం అప్లై చేసుకుని, కాసేపు ఉన్నతర్వాత కడిగేసుకుందంట.


Read more: Venu Swamy: రంగంలోకి దిగిన మహిళ కమిషన్.. చైతు, శోభితల జాతకం వ్యవహారంలో మరో ట్విస్ట్..  


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఛీ.. ఛీ.. అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదేం ఛెండాలమంటూ కామెంట్లు చేస్తున్నారు. కడుపుకుఅన్నం తింటావా.. అదే తింటావా..అంటూ మరికొందరు యువతిని  ఏకీపారేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట రచ్చగా మారింది.